కేంద్రం సంచలన నిర్ణయం.. ఇవన్నీ ఇక ప్రైవేట్‌కే..!?
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి దెబ్బతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. అసలు ఈ లోటు నుంచి ఎప్పుడు కోలుకుంటుందో కూడా తెలియని పరిస్థితి. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకోబోతోంది. ఈ మేరకు దేశంలో వేలం ద్వారా ఆరు ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అదే విధంగా దేశంలో 12 ఎయిర్‌పోర్టుల్లో ప్రైవేటు పెట్టుబడుల శాతం పెంచడానికి సన్నాహాలు చేస్తోంది. మరోవైపు.. కేంద్రపాలిత ప్రాంతాల్లోని డిస్కమ్‌లు కూడా ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించింది. వాణిజ్య విధానానికి అనుగుణంగా బొగ్గు గనుల్లో కొత్త సంస్కరణలు తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది.
రక్షణ, అంతరిక్షం కూడా!
ఇదిలా ఉంటే.. అత్యంత కీలకమైన రక్షణరంగంలో 49శాతం నుంచి 74శాతం వరకు ఎఫ్‌డీఐలు ఇవ్వాలని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఆస్పత్రులు, విద్యా సంస్థల ఏర్పాటులో కూడా ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పాత్ర ఉండాలని కేంద్రం భావిస్తోంది. అంతరిక్ష రంగంలో ఇస్రోతో పాటు ప్రైవేటు సంస్థలకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రీసెర్చ్ అణురియాక్టర్లు తయారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రటన ఎప్పుడు వస్తుందో..? ప్రైవేట్‌మయం చేయాలనుకుంటున్న కేంద్రం తీరుపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments