సినీ ఇండ‌స్ట్రీకి కేంద్ర ప్ర‌భుత్వం వ‌రం..

  • IndiaGlitz, [Sunday,January 31 2021]

కోవిడ్ ప్ర‌భావంతో దాదాపు ఎనిమిది నెల‌లు పాటు సినీ ప‌రిశ్ర‌మ కోలుకోలేని దెబ్బతింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నాయి. క్ర‌మంగా సినిమా షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. అయితే నిర్మాత‌ల‌ను థియేట‌ర్స్ రూపంలో చాలా రోజుల పాటు భ‌యం వెంటాడింది. షూటింగ్‌ల‌కు అనుమ‌తి ఇచ్చిన ప్ర‌భుత్వం థియేట‌ర్స్‌ను ఓపెన్ చేయ‌డానికి మాత్రం స‌మ‌యం తీసుకుంది. ముందు యాబై శాతం సీటింగ్ కెపాసిటీలో థియేట‌ర్స్‌ను ఓఎన్ చేయ‌డానికి ఓకే చెప్పిన కేంద్ర ప్ర‌భుత్వం క్ర‌మంగా సీటింగ్ కెపాసిటీని పెంచుకోవ‌చ్చున‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా వంద శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్స్‌ను ర‌న్ చేసుకోవ‌డానికి నేటి నుంచి అనుమ‌తులు ఇచ్చేసింది. అయితే థియేట‌ర్స్‌కు కొన్ని అనుమ‌తుల‌ను జారీ చేసింది.

నిజానికి చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ వంద శాతం థియేటర్ ఆక్యుపెన్సీకి అనుమతులు కావాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ వచ్చారు. సంక్రాంతికి కూడా యాబై శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్స్‌లో బొమ్మ పడింది. ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు అనుమతులు ఇచ్చినప్పటికీ కేంద్ర మోకాళ్లడ్డింది. అయితే రెండు వారాల వ్యవథిలోనే వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇచ్చింది.

More News

ఏప్రిల్ 9న ‘వ‌కీల్ సాబ్‌’ రిలీజ్

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో

'మ‌హాస‌ముద్రం' ఆగ‌స్ట్ 19న విడుద‌ల‌

శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న 'మ‌హాస‌ముద్రం' ఆగ‌స్ట్ 19న విడుద‌ల కానున్న‌ది.

'ఖిలాడి' మే 28న విడుద‌ల‌‌

'క్రాక్' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా, 'రాక్ష‌సుడు' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని తెర‌కెక్కించిన ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో

మస్క్‌ను న్యాయస్థానంలో నిలబెట్టిన భారతీయ విద్యార్థి

ప్రపంచ కుబేరుడు, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలన్ మస్క్‌ను ఓ భారతీయ అమెరికన్ విద్యార్థి న్యాయస్థానంలో నిలబెట్టగలిగాడు.

ఉక్కు మ‌హిళ పాత్ర‌లో కంగ‌నా.. !

భార‌త‌దేశం ఉక్కు మ‌హిళ .. ప్ర‌ధాని ఇందిరాగాంధీ. మ‌న దేశానికి తొలి మ‌హిళా ప్ర‌ధాని.