సినీ ఇండస్ట్రీకి కేంద్ర ప్రభుత్వం వరం..
Send us your feedback to audioarticles@vaarta.com
కోవిడ్ ప్రభావంతో దాదాపు ఎనిమిది నెలలు పాటు సినీ పరిశ్రమ కోలుకోలేని దెబ్బతింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. క్రమంగా సినిమా షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. అయితే నిర్మాతలను థియేటర్స్ రూపంలో చాలా రోజుల పాటు భయం వెంటాడింది. షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం థియేటర్స్‌ను ఓపెన్ చేయడానికి మాత్రం సమయం తీసుకుంది. ముందు యాబై శాతం సీటింగ్ కెపాసిటీలో థియేటర్స్‌ను ఓఎన్ చేయడానికి ఓకే చెప్పిన కేంద్ర ప్రభుత్వం క్రమంగా సీటింగ్ కెపాసిటీని పెంచుకోవచ్చునని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్‌ను రన్ చేసుకోవడానికి నేటి నుంచి అనుమతులు ఇచ్చేసింది. అయితే థియేటర్స్‌కు కొన్ని అనుమతులను జారీ చేసింది.
నిజానికి చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ వంద శాతం థియేటర్ ఆక్యుపెన్సీకి అనుమతులు కావాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ వచ్చారు. సంక్రాంతికి కూడా యాబై శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్స్‌లో బొమ్మ పడింది. ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు అనుమతులు ఇచ్చినప్పటికీ కేంద్ర మోకాళ్లడ్డింది. అయితే రెండు వారాల వ్యవథిలోనే వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com