అన్నమయ్య జిల్లా కలెక్టర్‌పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు

  • IndiaGlitz, [Thursday,January 18 2024]

ఏపీలో ఎన్నికల ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఓటర్ల జాబితాలో అక్రమాలకు అడ్డుకట్ట వేయని అధికారులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేసింది. తిరుపతి ఎంపీ ఉపఎన్నికల సమయంలో ఆయన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్నారు. అయితే ఆ సమయంలో దొంగ ఓట్లు వేసుకునేలా ఆయన సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఎన్నికకు ఈఆర్‌వోగా ఉన్న గిరీషా తన లాగిన్ ఐడీని అధికార వైసీపీ నేతలకు ఇచ్చారని ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేశాయి.

ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన సీఈసీ బృందం ఓటర్ల జాబితాలో అక్రమాల గురించి అధికారులపై సీరియస్ అయింది. ప్రతిపక్షాల ఫిర్యాదులపై గిరీషాను అధికారులు ప్రశ్నించగా తనకు ఏం తెలియదని సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ చేపట్టాలని సీఈసీ ఆదేశించింది. ఈ విచారణలో గిరీషా లాగిన్ ఐడీ ద్వారా 30 వేలకుపైగా ఎపిక్‌ కార్డుల్ని అక్రమంగా డౌన్‌లోడ్ చేసినట్లు తేలింది. దీంతో గిరీషాను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆయనతో పాటు ఇందులో ప్రమేయం ఉన్న ఇతర అధికారుల వివరాలు కూడా పంపించాలని ఆదేశాలు ఇచ్చింది. జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారిని కూడా ఆదేశించింది.

కాగా రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. విచ్చలవిడిగా దొంగ ఓట్లు చేరుస్తున్నారని ఆరోపిస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇదే విషయమై ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సాక్ష్యాలు కూడా సమర్పించారు. దీంతో రంగంలోకి దిగిన ఈసీ అధికారులు ముందుగా అన్నమయ్య జిల్లా కలెక్టర్‌పై చర్యలు తీసుకున్నారు. అలాగే అక్రమాలకు సహకరించిన మిగిలిన అధికారులపై కూడా త్వరలోనే వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికల ప్రక్రియ మొదలు కాక ముందే కేంద్ర ఎన్నికల సంఘం ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. త్వరలో జరగనున్న ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు చేపట్టింది.

More News

YSRCP:అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జీల 4వ జాబితా విడుదల

ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార వైసీపీ అన్ని రకాలుగా సిద్ధమవుతోంది.

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'సలార్'

Guntur Karaam:దుమ్మురేపిన మహేష్.. 'గుంటూరు కారం' తొలి వారం వసూళ్లు ఎంతంటే..?

సంక్రాంతి కానుకగా విడుదలైన 'గుంటూరు కారం' సినిమా కలెక్షన్స్‌లో దుమ్మురేపింది. మిక్స్‌డ్ టాక్ వచ్చినా మహేష్ బాబు స్టామినాతో థియేటర్లకు

Dhanush Nagarjuna:ధనుష్, నాగార్జున మల్టీస్టారర్ మూవీ షూటింగ్ ప్రారంభం

తమిళ స్టార్ హీరో ధనుష్‌.. తెలుగు సినిమా దర్శకులపై మక్కువ పారేసుకుంటున్నారు. ఇటీవల యువ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో

Kodali Nani:ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలన్న బాలకృష్ణకు కొడాలి నాని కౌంటర్

దివంగత సీఎం నందమూరి తారక రామారావు వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు