తెలంగాణకు వచ్చిన కేంద్ర ఎన్నికల బృందం.. ఈనెల 6 తర్వాత షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ఎన్నికలకు వేళాయైంది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల బృందం మూడు రోజుల రాష్ట్ర పర్యనటకు వచ్చింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ శంషాబాద్ వినామాశ్రయం చేరుకున్నారు. వీరికి అధికారులు ఘన స్వాగతం పలికారు. 5వ తేదీ వరకు వివిధ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో 6వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కానున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఎందుకుంటే 2018 ఎన్నికల సమయంలో అక్టోబర్ 6న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహించి.. 11న ఫలితాలు ప్రకటించారు. ఈసారి కూడా అదే తేదీన కానీ అటు ఇటుగా రెండు రోజుల తర్వాత కానీ షెడ్యూల్ ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఎన్నిలక నిర్వహణ ఏర్పాట్లు సమీక్ష.. ఏ క్షణంలోనైనా షెడ్యూల్ ప్రకటన..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌తో రాజీవ్ కుమార్ కేంద్ర ఎన్నికల బృందం అధికారులు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష చేస్తున్నారు. వీవీప్యాట్, పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణ, పోలింగ్ కేంద్రాలు, ఓటర్ స్లిప్పులు, ఈవీఎంలు వాంటి అంశాలపై చర్చిస్తున్నారు. ఈ భేటీ అనంతరం అన్ని పార్టీల నేతలతోనూ సమావేశం కానున్నారు. తదుపరి జిల్లాల పర్యటన చేపట్టి స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేయడం, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించనున్నారు. 5వ తేదీ రాత్రికి లేదా 6వ తేదీ ఉదయం ఢిల్లీ చేరుకుంటారు. ఆ తదుపరి ఏ క్షణంలోనైనా తెలంగాణతో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో అలుముకున్న ఎన్నికల వాతావరణం..
మరోవైపు గత నెల రోజుల ముందు నుంచే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడి వేడిగా ఉంది. అన్ని పార్టీల కంటే ముందుగా అధికార బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించి ఎన్నికల సమరానికి సై అంది. ఇప్పటికే గులాబీ అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. అయితే అసంతృప్తుల సెగ కూడా పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ కూడా ప్రచారంలోకి దిగాయి. ఇరు పార్టీల అగ్రనేతలు ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించి క్యాడర్‌లో జోష్ నింపారు. కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి నేతలు రాష్ట్ర పర్యటనకు వచ్చి ఆరు గ్యారంటీ హామీలను ప్రకటించారు. ఇక బీజేపీ నుంచి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించారు. మొత్తానికి తెలంగాణలో ఎన్నికల వాతావరణం అలుముకుంది. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు దూసుకుపోతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments