KCR: సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరిక నోటీసులు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. రెచ్చగొట్టే ప్రసంగాలపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. బాధ్యతాయుతమైన పదవి, పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా కొనసాగుతూ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని నోటీసుల్లో పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల పార్టీ అనుమతులు రద్దు చేసే అధికారం తమకు ఉందని.. కానీ ప్రస్తుతం దీనిని సీరియస్‌గా తీసుకోవడం లేదని భవిష్యత్‌లో తీవ్రంగా పరిగణిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఈసీఐ అడ్వైజరీ కమిటీ నోటీసులను సీఈవో వికాస్ రాజ్ ముఖ్యమంత్రికి పంపించారు.
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగిన ఘటనపై స్పందిస్తూ బాన్సువాడ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'భిన్న కులమతాలు, వర్గాల ప్రజల మధ్య వైషమ్యాలు పెంపొందించేలా ఈ ప్రసంగం ఉంది. ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనే'అని ఈసీఐ స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని వెల్లడించింది.
దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల రోజుల క్రితం బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి గురించి మాట్లాడుతూ బాన్సువాడ సభలో కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి వెనుక కాంగ్రెస్ హస్తం ఉందంటూ తీవ్ర పదజాలంతో ఆ పార్టీ నేతలను దూషించారు. దీంతో కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం ఈ మేరకు కేసీఆర్‌కు హెచ్చరిక నోటీసులు జారీచేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout