KCR: సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరిక నోటీసులు

  • IndiaGlitz, [Saturday,November 25 2023]

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. రెచ్చగొట్టే ప్రసంగాలపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. బాధ్యతాయుతమైన పదవి, పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా కొనసాగుతూ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని నోటీసుల్లో పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల పార్టీ అనుమతులు రద్దు చేసే అధికారం తమకు ఉందని.. కానీ ప్రస్తుతం దీనిని సీరియస్‌గా తీసుకోవడం లేదని భవిష్యత్‌లో తీవ్రంగా పరిగణిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఈసీఐ అడ్వైజరీ కమిటీ నోటీసులను సీఈవో వికాస్ రాజ్ ముఖ్యమంత్రికి పంపించారు.

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగిన ఘటనపై స్పందిస్తూ బాన్సువాడ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'భిన్న కులమతాలు, వర్గాల ప్రజల మధ్య వైషమ్యాలు పెంపొందించేలా ఈ ప్రసంగం ఉంది. ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనే'అని ఈసీఐ స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని వెల్లడించింది.

దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల రోజుల క్రితం బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి గురించి మాట్లాడుతూ బాన్సువాడ సభలో కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి వెనుక కాంగ్రెస్ హస్తం ఉందంటూ తీవ్ర పదజాలంతో ఆ పార్టీ నేతలను దూషించారు. దీంతో కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం ఈ మేరకు కేసీఆర్‌కు హెచ్చరిక నోటీసులు జారీచేసింది.

More News

Bigg Boss Telugu 7: ‘ ఒక్క ఛాన్స్ అన్నా.. శివాజీని వేడుకున్న అమర్‌దీప్, షాకిచ్చిన బిగ్‌బాస్.. తెగేదాకా లాగితే ఇంతే

బిగ్‌బాస్ సీజన్ 7 తెలుగు చివరి దశకు చేరుకుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ వుండగా.. ఈ సీజన్‌కు లాస్ట్ కెప్టెన్ ఎవరో ఈ వారం తేలిపోనుంది.

Modi: ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం

తెలంగాణ ఎన్నికల వేళ ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాదిగలకు రిజర్వేషన్ ఫలాలు అందేలా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియకు కమిటీని ఏర్పాటుచేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Rythubandhu: రైతుబంధు నిధుల విడుదల.. బీఆర్ఎస్‌కు లాభం చేకూరనుందా..?

తెలంగాణ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ ఊరట దక్కింది. రైతుబంధు నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Koose Munisamy Veerappan:ZEE5 తమిళ్ ఒరిజినల్ డాక్యుమెంట్ సిరీస్ ‘కూసే మునస్వామి వీరప్పన్’ తెలుగు ట్రైలర్ విడుదల

నవంబర్ 24, నేషనల్: పలు భాషల్లో వైవిధ్యమైన కంటెంట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ మన దేశంలోనే అతి పెద్దదైన ఓటీటీ మాధ్యమంగా రాణిస్తోంది ZEE5.

Hi Nanna:లవ్, ఎమోషన్, సెంటిమెంట్‌.. 'హాయ్ నాన్న' ట్రైలర్ వచ్చేసింది..

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'హాయ్ నాన్న' చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.