కేంద్ర కేబినెట్లో చోటు దక్కిన 42 మంది నేతలు వీరే..
- IndiaGlitz, [Thursday,May 30 2019]
భారతీయ జనతాపార్టీ ఎవరు సపోర్టు లేకుండా స్వతంత్రంగా పోటీచేసి ఎవరూ ఊహించని రీతిలో సీట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం మోదీ మానియా.. షా చరిష్మా మాత్రమేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నేడు అనగా మే-30న మోదీ.. వరుసగా రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సరిగ్గా ఇవాళ రాత్రి 7గంటలకు ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ తరుణంలో ఆయనతో పాటు ఎవరెవరు మంత్రులుగా ప్రమాణం చేస్తారు..? ఎన్నికల్లో టికెట్లు దక్కనట్లుగా.. కేబినెట్లో సీనియర్లకు మంత్రి పదవులు దక్కుతాయా..? లేదా అనేదానిపై దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చ జరుగుతోంది.
కాగా.. గురువారం మధ్యాహ్నమే 42 మంది మంత్రులతో కూడిన ఓ జాబితా విడుదలైంది. ప్రస్తుతం ఈ జాబితా సోషల్ మీడియా, టీవీ చానెళ్లలో పెద్దఎత్తున వైరల్ అవుతోంది. ఈ జాబితాలో ఎన్టీఏలో భాగస్వామ్యంగా ఉన్న పార్టీల నేతలకు, అటు తమిళనాడు, ఇటు తెలంగాణలో పాగా వేయాలని భావించిన కమలనాథులు ఈ రెండు రాష్ట్రాలకు చెరో మంత్రి పదవి కట్టబెట్టారు. ఇదిలా ఉంటే వీరిలో ఫస్ట్ టైమ్ ఎంపీ అయిన వాళ్లు ఉండగా తలలు పండిన రాజకీయ పండితులు సైతం ఉన్నారు. మరోవైపు సుమారు 10మందికి పైగా కొత్తముఖాలే ఈ జాబితాలో ఉన్నాయి. అయితే చాలా వరకు పాత ముఖాలనే రెండోసారి మోదీ కేబినెట్లో మంత్రులుగా చేర్చుకుంటున్నారు.
కాబోయే కేంద్ర మంత్రులు వీరే..!
రాజ్నాథ్ సింగ్
నితిన్ గడ్కరీ
సదానంద గౌడ
అర్జున్ రామ్ మేఘవాల్
ప్రకాశ్ జవడేకర్
రాందాస్ అథవాలే
ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ
బాబుల్ సుప్రీయో
సురేశ్ అంగాడి
డా. జితేంద్ర సింగ్
పీయూష్ గోయల్
రవిశంకర్ ప్రసాద్
కిషన్ రెడ్డి
ప్రహ్లాద్ జోషి
నిర్మలా సీతారామన్
స్మృతి ఇరానీ
ప్రహ్లాద్ పటేల్
రవీంద్ర నాథ్ (అన్నా డీఎంకే)
పరుషోత్తం రూపాలా
మన్సుక్ మాండవ్యా
రావ్ ఇందర్జీత్ సింగ్
కిషన్ పాల్ గుజ్జర్
అనుప్రియ పటేల్
కిరెణ్ రిజు
కైలాశ్ చౌదిరి
సంజీవ్ బలియాన్
ఆర్సీపీ సింగ్ (జేడీయూ)
నిత్యానంద్ రాయ్ (జేడీయూ)
థావర్ చంద్ గెహ్లాట్
దేబాశీష్ చౌదరి
రమేశ్ పోఖ్రియాల్
మన్సుక్ వసావా
రామేశ్వర్ తెలీ
హర్సిమ్రత్ కౌర్ బాదల్ (అకాలీదళ్)
సుష్మా స్వరాజ్
సోం ప్రకాశ్
సంతోష్ గాంగ్వర్
రాంవిలాస్ పాశ్వాన్ (ఎల్జేపీ)
గజేంద్ర సింగ్ షెకావత్
ధర్మేంద్ర ప్రదాన్
అర్జున్ ముండా
సాధ్వి నిరంజన్ జ్యోతి