రాష్ట్రాలకు నేడు కరోనా వ్యాక్సిన్.. సాయంత్రంలోపు హైదరాబాద్‌కు..
Send us your feedback to audioarticles@vaarta.com
అన్ని రాష్ట్రాలకు ఇవాళ కరోనా వ్యాక్సిన్‌ను కేంద్రం పంపిణీ చేయనుంది. పుణె నుంచి అన్ని రాష్ట్రాలకు కొవిషెల్డ్ వ్యాక్సిన్‌ను పంపించనున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. సాయంత్రం లోపు వ్యాక్సిన్ హైదరాబాద్‌కు చేరుకోనుంది. తెలంగాణకు మొదటి ప్రాధాన్యత కింద 6.5 లక్షల డోసులను పంపించనున్నారు. ఈ వ్యాక్సిన్‌ను ప్రాధాన్యతా క్రమంలో ప్రజలకు ప్రభుత్వం అందించనుంది. కోఠి ఫ్రీజర్ కేంద్ర కార్యాలయంలో వ్యాక్సిన భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేశరాు. 10 లక్షల డోసులు భద్రపరిచే విధంగా ఫ్రీజర్ వ్యవస్థను అధికారులు బలోపేతం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సింగ్ భద్రత కోసం 800 కోల్డ్ చైన్ కేంద్రాలను అదికారులు ఏర్పాటు చేశారు. కోఠి నుంచి వ్యాక్సిన్‌ను జిల్లా కేంద్రాల్లోని ఇమ్యూనేషన్ కేంద్రాలకు తరలించనున్నారు. తొలి ప్రాధాన్యత కింద 2.90లక్షల మందికి వ్యాక్సిన్‌ను అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలివిడత కింద 139 వ్యాక్సిన్ కేంద్రాలను అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ అనంతరం ఈ నెల 16న దేశ వ్యాప్తంగా తొలి విడత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. తెలంగాణలో ముందుగా.. 13,900 మంది హెల్త్ వర్కర్లకు ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు.
మొదటి రోజున ప్రతి జిల్లాలో సగటున రెండు, మూడు టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరగనుంది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో అత్యధిక కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఇదే రోజున 45 ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ టీకాల కార్యక్రమం ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. 18 నుంచి తెలంగాణ వ్యాప్తంగా కరోనా టీకా కేంద్రాలను 1200కు పెంచుతామని అధికారులు వెల్లడించారు. జనవరి 22లోగా వైద్య సిబ్బందికి టీకాలివ్వడం పూర్తి చేస్తామన్నారు. వారికి పూర్తయిన వెంటనే ఫ్రంట్‌లైన్ వారియర్లకు వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout