Gas:దేశ ప్రజలకు ‘‘రక్షాబంధన్ ’’ కానుక.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు, కేంద్రం ప్రకటన
Send us your feedback to audioarticles@vaarta.com
పేద, మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం రక్షా బంధన్ కానుక ఇచ్చింది. ఇంటి అవసరాల కోసం ఉపయోగించే సిలిండర్‌పై రూ.200 చొప్పున తగ్గించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. రక్షాబంధన్ కానుకగా సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించినట్లు అనురాగ్ ఠాకూర్ చెప్పారు.
ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ.400 మేర లబ్ధి :
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1103గా వుంది. కేంద్రం నిర్ణయంతో దీని ధర రూ.903కి చేరుకోనుంది. ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ పొందినవారికి సబ్సిడీ కింద రూ.200 ఇస్తుండగా, తాజా తగ్గింపుతో వారికి రూ.400 మేర లబ్ధి కలగనుంది. అంటే ఈ కేటగిరీ వారికి గ్యాస్ సిలిండర్ రూ.703కే లభించనుంది. దీనితో పాటు ఉజ్వల పథకం కింద కొత్తగా మరో 75 లక్షల కొత్త వంట గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని కేంద్రం తెలిపింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం:
ఇదిలావుండగా.. ఆయిల్ కంపెనీలు ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పలుమార్లు గ్యాస్ సిలిండర్ ధరలను సవరించాయి. అయితే ఇంటి అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరను మాత్రం స్ధిరంగానే వుంచాయి. అయితే ఈ ఏడాది చివరిలో తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్ , ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న వేళ కేంద్రం వంట గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించడం చర్చనీయాంశమైంది. 2016లో ప్రధాని నరేంద్ర మోడీ ‘‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ’’ ప్రారంభించారు. ఇప్పుడు కొత్తగా ఇవ్వనున్న కనెక్షన్లతో కలిపి ఉజ్వల పథకం కింద లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరుకోనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout