Gas:దేశ ప్రజలకు ‘‘రక్షాబంధన్ ’’ కానుక.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు, కేంద్రం ప్రకటన

  • IndiaGlitz, [Tuesday,August 29 2023]

పేద, మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం రక్షా బంధన్ కానుక ఇచ్చింది. ఇంటి అవసరాల కోసం ఉపయోగించే సిలిండర్‌పై రూ.200 చొప్పున తగ్గించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. రక్షాబంధన్ కానుకగా సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించినట్లు అనురాగ్ ఠాకూర్‌ చెప్పారు.

ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ.400 మేర లబ్ధి :

ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1103గా వుంది. కేంద్రం నిర్ణయంతో దీని ధర రూ.903కి చేరుకోనుంది. ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ పొందినవారికి సబ్సిడీ కింద రూ.200 ఇస్తుండగా, తాజా తగ్గింపుతో వారికి రూ.400 మేర లబ్ధి కలగనుంది. అంటే ఈ కేటగిరీ వారికి గ్యాస్ సిలిండర్ రూ.703కే లభించనుంది. దీనితో పాటు ఉజ్వల పథకం కింద కొత్తగా మరో 75 లక్షల కొత్త వంట గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని కేంద్రం తెలిపింది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం:

ఇదిలావుండగా.. ఆయిల్ కంపెనీలు ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పలుమార్లు గ్యాస్ సిలిండర్ ధరలను సవరించాయి. అయితే ఇంటి అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరను మాత్రం స్ధిరంగానే వుంచాయి. అయితే ఈ ఏడాది చివరిలో తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్ , ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న వేళ కేంద్రం వంట గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించడం చర్చనీయాంశమైంది. 2016లో ప్రధాని నరేంద్ర మోడీ ‘‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ’’ ప్రారంభించారు. ఇప్పుడు కొత్తగా ఇవ్వనున్న కనెక్షన్లతో కలిపి ఉజ్వల పథకం కింద లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరుకోనుంది.

More News

Pawan kalyan : పవన్ కళ్యాణ్ బర్త్ డే.. జనసేన వినూత్నం, ఐదు సేవా కార్యక్రమాలకు పిలుపు

జనసేన అధినేత , సినీనటుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజంటే అభిమానులకు పండుగ రోజు. పవన్ అన్న పేరే ప్రభంజనం,

Family Dhamaka:ఫ్యామిలీ ధమాకా.. ఇది దాస్ కా ఇలాఖా : విశ్వక్‌సేన్ హోస్ట్‌‌గా ఆహాలో రియాలిటీ షో, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ బాగా విస్తరిస్తోంది. సీనియర్ హీరో హీరోయిన్లు , నటుడు, ప్రతిభావంతులకు ఈ పరిశ్రమ అవకాశాలు కల్పిస్తోంది.

Phone ban: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం .. స్కూళ్లలో మొబైల్ ఫోన్లపై నిషేధం

సమాచార మార్పిడి కోసం అందుబాటులోకి వచ్చిన సెల్‌ఫోన్ ప్రస్తుతం మనిషి నిత్య జీవితంలో భాగమైన సంగతి తెలిసిందే.

NTR100 Rupees Coin:రూ.100 ఎన్టీఆర్ నాణెం విడుదల .. ఢిల్లీ ఘనంగా కార్యక్రమం, హాజరైన అన్నగారి కుటుంబం

టీడీపీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా

Congress:చేవేళ్లలో ప్రజా గర్జన : ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన టీ.కాంగ్రెస్.. ముఖ్యాంశాలివే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పీడు పెంచింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు తాయిళాలు ప్రకటిస్తోంది.