కోవిడ్ వ్యాక్సిన్ గురించి బ్యాడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
Send us your feedback to audioarticles@vaarta.com
ఆగస్ట్ 15 నాటికి కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేస్తుంది... ఇంకేమంది.. మనమంతా సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోతామని భావిస్తున్న వారందరికీ కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. 2021 వరకూ వ్యాక్సిన్ వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. దీంతో ఐసీఎంఆర్ డెడ్‌లైన్‌పై ఒక్కసారిగా దుమారం రేగింది. ఆగస్ట్ 15 వరకూ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలంటూ ఐసీఎంఆర్ ఆదేశాలివ్వడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
కేవలం ట్రయల్స్‌కే తొమ్మిది నెలలు పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. కోవాక్సిన్, జైకోవ్-డీతోపాటు కరోనా చికిత్సకు ప్రయోగాలు జరుపుకుంటున్న ఏ వ్యాక్సిన్ కూడా 2021కి ముందు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. మరి దీనిపై ఐసీఎంఆర్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments