లాక్ డౌన్ 4.0కు కేంద్రం సిద్ధం.. రేపే మార్గదర్శకాలు!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం విదితమే. రేపటితో అనగా ఆదివారం మే-17తో 3.0 లాక్‌డౌన్‌ను ఇండియా పూర్తి చేసుకోనుంది. ఇప్పటికీ ఇంకా కరోనా థాటి నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో లాక్ డౌన్‌ను పొడిగించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే కేంద్రం సర్వం సిద్ధంచేసినట్లు తెలిసింది. రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం లాక్ డౌన్ 4.0 పై కేంద్రం నుంచి మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. అయితే మునుపటి కంటే ఈసారి ఎక్కువగా సడలింపులు ఉండే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.
వేటికి గ్రీన్ సిగ్నలో..!
మరీ ముఖ్యంగా పరిమిత ఆంక్షలతో రవాణా సదుపాయాలు పునరుద్ధరించే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం వేటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది..? వేటికి రెడ్ సిగ్నల్ ఉండబోతోంది..? అనే దానిపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఈసారి జోన్లను నిర్దారించే అవకాశం రాష్ట్రాలకే ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా హాట్స్పాట్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవడానికి కేంద్రం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇదివరకే తేల్చేసిన మోదీ!
కాగా.. ఇదివరకే 4.0 లాక్‌డౌన్‌పై ప్రధాని నరేంద్ర పరోక్షంగా తేల్చేశారు. కరోనాతో పోరాడుతూనే ముందుకు సాగాలని.. ఇప్పుడప్పుడే మానవాళిని విడిచి వెళ్లే అవకాశం లేదని అనేకమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారని జాతినుద్ధేశించి ప్రసంగం చేసినప్పుడు వెల్లడించారు. అదే విధంగా.. ఎన్నో మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొన్న భారత్ కరోనాను కూడా దీటుగా ఎదుర్కొంటోందని సంక్షోభం కంటే మన సంకల్పం గొప్పదన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments