Somesh Kumar: సోమేష్ కుమార్‌కు షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ నుంచి రిలీవ్, ఏపీకి వెళ్లాలని ఆదేశం
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనను తెలంగాణను రిలీవ్ చేస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (డీవోపీటీ) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లుండి లోగా ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశాల్లో తెలిపింది. దీంతో సోమేష్ కుమార్ ఏం చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
క్యాట్‌ను ఆశ్రయించిన సోమేశ్ కుమార్:
అంతకుముందు సీఎస్ సోమేష్ కుమార్‌ను తెలంగాణకు కేటాయించడాన్ని రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. ఆయన ఏపీ కేడర్‌కు వెళ్లాలని మంగళవారం ఏపీ హైకోర్ట్ డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో సోమేష్ కుమార్‌ను కేంద్రం ఏపీకి కేటాయించింది. దీనిని సవాల్ చేస్తూ ఆయన కేంద్ర పరిపాలనా ట్రిబ్యూనల్ (క్యాట్)ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన క్యాట్ కేంద్రం ఉత్తర్వులు నిలిపివేస్తూ సోమేష్ కుమార్‌ను తెలంగాణలో కొనసాగిస్తూ తీర్పు వెలువరించింది.
ఉమ్మడి రాష్ట్రంలో సోమేశ్‌కు సుదీర్ఘ పరిపాలనా అనుభవం:
కాగా.. 2020 జనవరి 1 నుంచి సోమేశ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అప్పట్లో సీనియర్ అధికారి అజయ్ మిశ్రా ఉన్నప్పటికీ కేసీఆర్ సోమేశ్ వైపు మొగ్గుచూపారు. 1989 ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన సోమేశ్ కుమార్ ఉమ్మడి రాష్ట్రంలో ట్రైబల్ వెల్ఫేర్, రెవెన్యూ , కమర్షియల్ టాక్స్, ఎక్సైజ్, ఏపీ అర్బన్ సర్వీస్‌లో ప్రిన్సిలప్ సెక్రటరీ హోదాలో పనిచేశారు. బోధన్ సబ్ కలెక్టర్‌గా, నిజామాబాద్, అనంతపురం జిల్లా కలెక్టర్లుగా విధులు నిర్వర్తించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments