విజయ్‌ ఫ్యాన్స్‌కు సెంట్రల్‌ షాక్‌.. నిరుత్సాహంలో కోలీవుడ్‌

  • IndiaGlitz, [Wednesday,January 06 2021]

కోలీవుడ్‌ అగ్ర హీరోల్లో విజయ్‌ ఒకడు. ఈయన సినిమాలకు ఉండే కలెక్షన్సే వేరు. ఆదరణే వేరు. ఈయన లేటెస్ట్‌ మూవీ 'మాస్టర్‌'. నగరం, ఖైదీ చిత్రాల దర్శకుడు లొకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించారు. గత ఏడాది సమ్మర్‌కు విడుదల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్‌ ప్రభావంతో వాయిదా పడింది. థియేటర్స్‌ యాబై శాతం ఆక్యుపెన్సీతో ఓపెన్‌ కావడంతో సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు.

అయితే తమిళనాడు ప్రభుత్వం హీరో విజయ్‌కి ఉన్న అభిమానగణాన్ని దృష్టిలో పెట్టుకుని వంద శాతం థియేటర్స్‌ ఆక్యుపెన్సీకి పర్మిషన్ష్‌ ఇస్తున్నట్లు తెలియజేసింది. దీంతో కోలీవుడ్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టింది. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన వంద శాతం ఆక్యుపెన్సీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించింది.

తమ అభిమాన హీరో సినిమానే తొలిరోజునే చూడాలని అనుకున్న హీరో విజయ్‌ అభిమానులకు, సినిమా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్‌ , ఎగ్జిబిటర్స్‌కు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం షాక్‌ అయ్యింది. కోలీవుడ్ వర్గాలు నిరుత్సాహంలో మునిగిపోయాయి.

More News

సినిమా ఛాన్స్ కొట్టేసిన అఖిల్ సార్థక్‌!

బిగ్‌బాస్ తెలుగు ఇప్పటికి నాలుగు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. అయితే గత మూడు సీజన్ల విషయానికి వస్తే కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ కారణంగా పెద్దగా ఒరిగిందేమీ లేదు.

కేజీఎఫ్ 2: అధీర ఎలా బతికున్నాడు?

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్న ఎంత సెన్సేషన్‌ను క్రియేట్ చేసిందో... ప్రస్తుతం అధీర ఎలా బతికున్నాడు? అనే ప్రశ్న కూడా అంతే సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తోంది.

‘ఆచార్య’ టెంపుల్ టౌన్‌ సెట్‌ను చూశారా?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’.

మూడేళ్లుగా దాచిన రహస్యాన్ని బయటపెట్టిన ఇస్రో శాస్త్రవేత్త..

భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త తపన్ మిశ్రా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది.

‘ఆచార్య’ సెట్‌లో ఆకట్టుకున్న సోనూసూద్.. 100 మందికి..

‘ఆచార్య’ షూటింగ్‌ సెట్‌లో ప్రముఖ నటుడు సోనూసూద్ ఆకట్టుకున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు..