విజయ్ ఫ్యాన్స్‌కు సెంట్రల్ షాక్.. నిరుత్సాహంలో కోలీవుడ్
Send us your feedback to audioarticles@vaarta.com
కోలీవుడ్ అగ్ర హీరోల్లో విజయ్ ఒకడు. ఈయన సినిమాలకు ఉండే కలెక్షన్సే వేరు. ఆదరణే వేరు. ఈయన లేటెస్ట్ మూవీ 'మాస్టర్'. నగరం, ఖైదీ చిత్రాల దర్శకుడు లొకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. గత ఏడాది సమ్మర్‌కు విడుదల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ ప్రభావంతో వాయిదా పడింది. థియేటర్స్ యాబై శాతం ఆక్యుపెన్సీతో ఓపెన్ కావడంతో సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు.
అయితే తమిళనాడు ప్రభుత్వం హీరో విజయ్‌కి ఉన్న అభిమానగణాన్ని దృష్టిలో పెట్టుకుని వంద శాతం థియేటర్స్ ఆక్యుపెన్సీకి పర్మిషన్ష్ ఇస్తున్నట్లు తెలియజేసింది. దీంతో కోలీవుడ్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టింది. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన వంద శాతం ఆక్యుపెన్సీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించింది.
తమ అభిమాన హీరో సినిమానే తొలిరోజునే చూడాలని అనుకున్న హీరో విజయ్ అభిమానులకు, సినిమా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ , ఎగ్జిబిటర్స్‌కు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం షాక్ అయ్యింది. కోలీవుడ్ వర్గాలు నిరుత్సాహంలో మునిగిపోయాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com