CAA: కేంద్రం మరో సంచలన నిర్ణయం.. సీఏఏ అమలు చేస్తూ నోటిఫికేషన్..

  • IndiaGlitz, [Monday,March 11 2024]

లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం(CAA)ను నేటి నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2019 డిసెంబర్ 11వ తేదీన ఈ పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంట్లో ఆమోదం పొందింది. దీనికి సంబంధించి అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా సంతకం చేశారు. అయితే ఈ చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో నిబంధనలు, విధివిధానాలు మాత్రం ఇప్పటివరకు కేంద్రం రూపొందించలేదు. తాజాగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ చట్టాన్నిఅమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది.

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి భారత్ పౌరసత్వాన్ని ఇచ్చేందుకు కేంద్రం ఈ నిబంధనల్ని రూపొందించింది. దీని ప్రకారం 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు భారత్ పౌరసత్వం లభిస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ముగుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన నిబంధనలు నోటిఫై చేయడంతో ఈ చట్టం అమలులోకి వచ్చింది. కాగా ఎన్నికల ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇటీవల పలుమార్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

అయితే 1995లో వచ్చిన పౌరసత్వ చట్టానికి సవరణలు చేస్తూ 2019లో ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చింది. 1995 చట్టంలో తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంలో విదేశాల నుంచి వలస వచ్చిన ముస్లింలను మినహాయించడం తీవ్ర దుమారం రేపింది. దీంతో 2019లో తీసుకువచ్చిన ఈ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఆందోళనలు, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని కొన్ని బీజేపీయేతర రాష్ట్రాలు.. సీఏఏను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తమ రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేయమని తేల్చి చెప్పాయి. మొత్తానికి ఎన్నికల వేళ కీలకమైన సీఏఏ చట్టం అమల్లోకి తీసుకురావడం బీజేపీ మాస్టర్ ప్టాన్‌ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More News

హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్న కిరణ్ అబ్బవరం.. ఎప్పుడంటే..?

ఈ మధ్య తెలుగు హీరోలు ఒక్కొక్కరిగా పెళ్లీ పీటలు ఎక్కుతున్నారు. తాజాగతా మరో యంగ్ హీరో ఓ ఇంటివాడు అయ్యేందుకు రెడీ అయ్యారని ఫిల్మ్ నగర్ టాక్.

Janasena: మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన.. టీడీపీ అభ్యర్థికి లైన్ క్లియర్..

జనసేన పార్టీ మరో నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గం అభ్యర్థిగా కందుల దుర్గేష్‌ను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.

Surya Kiran: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూత

తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటి కల్యాణి భర్త, దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశారు. కొంత కాలంగా పచ్చ కామెర్లతో బాధపడుతున్న

Mudragada: జగన్‌ను మరోసారి సీఎంగా చేసుకుందాం.. ప్రజలకు ముద్రగడ బహిరంగ లేఖ..

జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ఏపీ సీఎంగా చేసుకుందామంటూ రాష్ట్ర ప్రజలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. ఈనెల 14న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నానని ప్రకటించారు.

Naatu Naatu: ఆస్కార్ వేదికపై మరోసారి 'నాటునాటు' పాట.. నగ్నంగా స్టేజ్ పైకి వచ్చిన నటుడు..

ఆస్కార్ అవార్డ్స్ వేడుక అమెరికాలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో మన తెలుగు పాట మరోసారి అలరించింది. గతేడాది RRR మూవీలోని 'నాటు నాటు' పాటకు బెస్ట్ ఒరిజనల్ సాంగ్ అవార్డు