సినిమా థియేటర్స్, స్కూల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర ప్రభుత్వం సినిమా థియేటర్స్‌ను ఓపెన్ చేయడానికి గ్రీన్ సిగ్నల్‌ను ఇచ్చింది. సెప్టెంబర్ 30తో అన్‌లాక్ 4.0 ముగిసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని మినహాయింపులతో అన్‌లాక్ 5.0కు అనుమతిని ఇచ్చింది. ఇందులో కంటోన్మెంట్ జోన్స్‌లో అక్టోబర్ 15 నుండి సినిమా థియేటర్స్, మల్టీప్లెక్సులను ఓపెన్ చేయడానికి గ్రీన్ సిగ్నల్‌ను ఇచ్చింది. అయితే థియేటర్స్‌ను 50 శాతం సామర్థ్యంతో మాత్రమే రన్ చేయాలనే కండీషన్‌ను పెట్టింది. అక్టోబర్ 15 నుండి స్కూళ్లు తెరిచే అంశంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకునే అవకాశాన్ని కల్పించింది. అంతే కాకుండా ఎగ్జిబిషన్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులను తెరిచేందుకు కూడా కేంద్రం అనుమతులు ఇచ్చింది. కంటైన్మెంట్ జోన్స్‌లో ఈ నెల 31 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని కేంద్ర పేర్కొంది.
కోవిడ్ ఎఫెక్ట్ ప్రారంభమైన సందర్భంలో జనాలు ఎక్కువగా కలిసే అవకాశాలున్న ప్రాంతాలను కేంద్రం మూసివేయడంతో పాటు దేశమంతటా లాక్‌డౌన్‌ను ప్రకటించింది. క్రమంగా లాక్‌డౌన్‌ను సడలిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సినిమా థియేటర్స్‌ను ఓపెన్ చేయాలంటూ సినీ రంగం నుండి వినతులు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 5.0లో థియేటర్స్, స్కూల్స్ ఓపెన్ చేసుకోవడానికి అనుమతులు ఇచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments