ప్రత్యేక రైళ్లు నడిపేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థుల ఎక్కడికక్కడ ఇరుక్కుపోయారు. ఇంటికెళ్లలేక అక్కడే ఉండలేక ఇన్నిరోజులూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్వరాష్ట్రాలకు వస్తే క్వారంటైన్‌కు వెళ్లాలని ప్రభుత్వాలు సూచించడంతో.. అప్పటికే వారున్న రాష్ట్రాల్లో క్వారంటైన్‌లో ఉండి మళ్లీ ఇక్కడ కూడా ఉండాలని చెబుతుండటంతో ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో వారిని తరలించానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు వారి కోసం ప్రత్యేక రైళ్లు నడిపేందుకు కేంద్రం అనుమతిచ్చింది. శుక్రవారం నాడు ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. టికెట్ల విక్రయాలు, సామాజికదూరం, ఇతర అంశాలపై త్వరలో రైల్వేశాఖ మార్గదర్శకాలు విడుదల చేయనున్నది. అయితే.. ట్రక్కులు, వస్తువుల రవాణా వాహనాలకు ప్రత్యేక పాసులు అవసరం లేదని కూడా తెలిపింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు కూడా రిలీజ్ చేసింది.
ఇప్పటికే రైళ్లు..
ఇదిలా ఉంటే.. ఇప్పటికే తెలంగాణా నుంచి 12వందల మందితో ప్రత్యేక రైలు జార్ఖండ్ బయలుదేరిన విషయం తెలిసిందే. మరో రైలు కేరళ నుంచి ఒడిశాకు వెళ్లనున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే.. ఇతర రాష్ట్రాల్లో ఉండే కార్మికులు, విద్యార్థులు, యాత్రికులను తరలించిన తర్వాత మూడోసారి లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులను కేంద్రం అనుమతితో తరలిస్తున్నారు.
కొరతే లేదు..
దేశంలో నిత్యావసర వస్తువులకు కొరతలేదని, 62 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్రాలు సేకరించాయని కేంద్రం తెలిపింది. సరుకు రవాణాకు ఇబ్బంది రాకుండా రాష్ట్రాలు చూసుకోవాలని.. నిత్యావసర వస్తువులకు ఎలాంటి కొరత లేదు కేంద్రం స్పష్టం చేసింది. ప్రత్యేక రైళ్లకు శ్రామిక్ స్పెషల్ పేరు ఖరారు చేయడం జరిగింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల అనుమతితో వలస కార్మికుల తరలింపు జరుగుతోంది. ఇందుకు గాను ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లుగా సీనియర్ అధికారుల నియామిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments