లాక్‌డౌన్‌లో లిక్కర్ అమ్మకాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు లాక్‌డౌన్ పొడిగించిన కేంద్రం తాజాగా మరోసారి పొడిగించింది. ఈ 3.0 లాక్‌డౌన్ రెండు వారాల పాటు అనగా మే-17 వరకు కొనసాగనుంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కేంద్ర హోం శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.గ్రీన్, ఆరెంజ్ జోన్లలో లాక్‌డౌన్ నుంచి కొన్ని మినహాయింపులు ఉంటాయని స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లలో పూర్తిగా ఆంక్షలు అమలు కానున్నాయి.
మద్యం ప్రియులకు శుభవార్త..
ఇదిలా ఉంటే.. ఈ పొడిగింపులో భాగంగా మద్యం ప్రియులకు కేంద్ర తియ్యటి శుభవార్త తెలిపింది. లిక్కర్ అమ్మకాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. భౌతిక దూరం పాటిస్తూ అమ్మకాలు జరుపుకోవచ్చని ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ సడలింపు కేవలం గ్రీన్, ఆరెంజ్ జోన్లకు మాత్రమే. అయితే.. బహిరంగ ప్రదేశాల్లో మాత్రం మద్యం, గుట్కా, పొగాకు అమ్మడం నిషేధం విధించింది. మద్యం షాపుల వద్దకు ఒక్కోసారి కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుందని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు, విమానాలపై నిషేధం కొనసాగించిన కేంద్రం.. లిక్కర్‌పై ఎందుకు నిషేధం ఎత్తేయలేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. శనివారం నాడు ప్రధాని నరేంద్ర మొదీ జాతినుద్ధేశించి మాట్లాడనున్నారు. ఈ సడలింపులపై.. ఇంకా కొన్ని కొన్ని కొత్త విషయాలు చెప్పనున్నారని తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితేంటి..!?
కేంద్రం ఇదివరకు పలు సడలింపులు ఇవ్వగా తెలుగు రాష్ట్రాలు మాత్రం ఒకటి అర తప్ప అన్నింటినీ అంగీకరించలేదు. అయితే తాజాగా లిక్కర్ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏం నిర్ణయం తీసుకోనున్నాయ్..? షాపులు తెరుస్తారా..? లేకుంటే అన్నింటితో పాటు వాటిని కూడా మూసేస్తారా..? అనేది తెలియాలంటే ప్రభుత్వం స్పందించాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments