హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. సోమవారం కిషన్రెడ్డి నేతృత్వంలో బీజేపీకి చెందిన తెలంగాణ నేతల బృందం రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీని కలిసింది. ఈ సందర్భంగా రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతి కోరగా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు కిషన్రెడ్డి తెలిపారు. అనంతరం ఆయన తమ పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. రీజనల్ రింగ్ రోడ్డు అంశంపై గడ్కరీని కలిశామని ఆయన సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు.
ఓఆర్ఆర్కి 30 కి.మీ దూరంలో అంటే హైదరాబాద్ నగరానికి 50 నుంచి 70 కి.మీ దూరంలో ఈ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగనుందని కిషన్రెడ్డి వెల్లడించారు. సుమారు 20కి పైగా ముఖ్య పట్టణాలను కలుపుతూ ఈ నిర్మాణం జరగనుంది. దీనిలో భాగంగా మొదటి దశలో సంగారెడ్డి - చౌటుప్పల్ వరకూ 158 కి.మీ మేర రూ.9,522 కోట్ల వ్యయంతో నిర్మించాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. రెండో దశలో చౌటుప్పల్ - సంగారెడ్డి మధ్య 182 కి.మీ మేర నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రెండు దశలకూ కలిపి సుమారు రూ.17 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో ఇదో గేమ్ ఛేంజర్ కానుందని కిషన్రెడ్డి వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout