సినీ, టీవీ షూటింగ్‌లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
Send us your feedback to audioarticles@vaarta.com
అన్‌లాక్ 3.0లో భాగంగా దేశ వ్యాప్తంగా సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగ్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్ నిర్వహించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు మూడు పేజీల గైడ్ లైన్స్‌ను కేంద్ర ప్రసారశాఖా మంత్రి ప్రకాశ్ జవదేవకర్ విడుదల చేశారు. ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన కార్మికులు దాదాపు ఐదు నెలలుగా పని లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు.
కేంద్రం గైడ్‌లైన్స్..
బహిరంగ ప్రదేశాల్లో యూనిట్ మొత్తం మాస్కులు ధరించాలి
ఆరోగ్యసేతు యాప్‌ను అంతా వినియోగించాలి
షూటింగ్ సమయంలో విజిటర్లకు అనుమతించవద్దు
మేకప్ సిబ్బంది కచ్చితంగా పీపీఈ కిట్లు దరించాలి
షూటింగ్‌లు సాధ్యమైనంత తక్కువ మందితోనే నిర్వహించాలి
థియేటర్లలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సీటింగ్ ఏర్పాటు చేయాలి
టికెట్లు ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయించాలి
షూటింగ్ పాయింట్ వద్ద సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి
షూటింగ్ ప్రదేశంలో తాత్కాలిక ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేసుకోవాలి
థియేటర్లలో సోషల్ డిస్టెన్స్‌ను అమలయ్యేలా సీటింగ్ ఉండాలి
టికెట్ల విక్రమాయలను ఆన్‌లైన్‌లోనే జరపాలి
అయితే తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్‌లకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చాలా రోజుల క్రితమే అనుమతినిచ్చాయి. తెలుగు ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతితో బుల్లితెర నిరాంటకంగా షూటింగ్‌లు నిర్వహిస్తుండగా.. సినిమాలకు సంబంధించిన షూటింగ్‌లు మాత్రం పెద్దగా జరగట్లేదు. చిన్న చిన్న సినిమాలకు సంబంధించిన షూటింగ్‌లను మాత్రమే నిర్వహిస్తున్నారు. పెద్ద సినిమాలు నేటికీ షూటింగ్‌కి నోచుకోలేదు. దీనికి కారణం స్టార్ హీరోలు షూటింగ్‌లకు నిరాకరించడమేనని సమాచారం. మరి తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతితోనైనా తెలుగు సినిమాల షూటింగ్‌లు ప్రారంభమవుతాయో.. లేదో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout