మోడీ సర్కార్ కీలక నిర్ణయం.. ఉచిత రేషన్ పథకం పొడిగింపు, ఎన్ని నెలలంటే
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా కారణంగా మనదేశంలో ఎలాంటి పరిస్దితులు చోటు చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీగా కేసులు, మరణాలు నమోదయ్యాయి. మధ్యలో వచ్చిన ఒమిక్రాన్ అంతగా భయపెట్టనప్పటికీ.. కొన్ని చోట్ల కఠినమైన ఆంక్షలు విధించడంతో ప్రజల ఆర్ధిక పరిస్ధితులు దిగజారాయి. ముఖ్యంగా నిరుపేదలు, దిగువ మధ్య తరగతి కుటుంబాల జీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. శనివారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రి మండలి ఉచిత రేషన్‌ను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఈ ఏడాది సెప్టెంబర్ దాకా పేదలకు ఉచిత రేషన్ అందనుంది. ఈ పథకం కింద దేశంలోని 80 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది.
కాగా.. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు ఉచిత రేషన్ పథకం కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. కరోనా సమయంలో యూపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. శనివారం మంత్రి మండలి తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం యోగి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఉఛిత రేషన్ పథకం’ను మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో రాష్ట్రంలోని 15 కోట్ల పేదలకు ఉచిత రేషన్ అందనుందని అంచనా. సీఎం యోగి తీసుకున్న నిర్ణయంతో సుమారు 15 కోట్ల మంది పేదలకు లబ్ది చేకూరుతుందని.. ఫలితంగా రాష్ట్ర ఖజానాపై రూ. 3 వేల 270 కోట్ల భారం పడుతుందని ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు. అయితే కేంద్రం ఈ పథకాన్ని ఆరు నెలల పాటు పొడిగించడంతో యూపీ ప్రభుత్వంపై ఈ పథకం భారం పడదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments