కరోనా మార్గదర్శకాలను పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు..

  • IndiaGlitz, [Tuesday,December 29 2020]

దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి విధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం మరోమారు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జనవరి 31 వరకూ కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. భారత్‌లో ఇటీవలి కాలంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ మధ్య కాలంలో చాలా తక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని నిబంధనలు పాటించాల్సిన ఆవశ్యకతను మరోమారు వెల్లడించింది.

ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను జనవరి 31 వరకూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. నవంబర్ 25న కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలనే తిరిగి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. మరోవైపు బ్రిటన్‌లో కరోనా కొత్త వైరస్ వ్యాప్తి కారణంగా కూడా కరోనా నిబంధనలను కేంద్రం పొడిగించింది. కాగా.. కంటైన్‌మెంట్ జోన్‌ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో నిర్దేశించిన నియంత్రణ చర్యలు కచ్చితంగా పాటించాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.

More News

లీగల్ చిక్కుల్లో అడవి శేష్.. వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు..

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టి.. హీరోగా తనకంటూ మంచి ఇమేజ్‌ను ఏర్పాటు చేసుకున్న నటుడు అడవి శేష్.

పార్టీ మారే విషయమై స్పందించిన వివేక్ వెంకటస్వామి

మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు వివేక్ వెంకటస్వామి త్వరలో పార్టీ మారబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై నేడు ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.

ఏఆర్ రెహ్మాన్‌కు మాతృవియోగం

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లిగారైన కరీమా బేగం నేడు మృతి చెందారు.

భారత్‌లో తొలిసారి అందుబాటులోకి డ్రైవర్‌ రహిత రైలు..

భారత్‌లో తొలిసారి డ్రైవర్‌ రహిత రైలు అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ మెట్రోలో డ్రైవర్ రహిత రైలును ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.

వైఎస్‌పై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు...

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఎవరో ఒకరి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనో..