థియేటర్స్ ఓపెనింగ్స్‌పై కేంద్రం నిర్ణయం ఇదీ..

  • IndiaGlitz, [Thursday,June 04 2020]

కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు, థియేటర్స్ మూసివేయడంతో ఇండస్ట్రీకి ఏ రేంజ్‌లో నష్టం వాటిల్లిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. షూటింగ్స్ త్వరలోనే ప్రారంభించుకోవచ్చు ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి కానీ.. జూన్ నుంచి మళ్లీ లాక్ డౌన్ 5.0 విధించడంతో మళ్లీ సీన్ మొదటికొచ్చింది. అయితే తాజాగా ఈ వ్యవహారంపై.. మరీ ముఖ్యంగా లాక్‌డౌన్ కారణంగా దాదాపు 70 రోజులుగా మూతబడిన సినిమా హాళ్లను తిరిగి తెరిచే విషయంలో కేంద్రం కీలక నిర్ణయమే తీసుకుంది. కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను తెరిచే విషయమై జూన్ తర్వాత మాత్రమే ఆలోచిస్తామన్నారు. ఈ నెలలో కోవిడ్ కేసుల సంఖ్యను, పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

జూన్ తర్వాతే నిర్ణయం..

కాగా బుధవారం రాత్రి సినిమా రంగంలోని వివిధ సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జవదేకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరిస్థితులపై నిశితంగా చర్చించారు. సమావేశంలో భాగంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను.. మరీ ముఖ్యంగా సినిమా థియేటర్లను తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు సినీ పెద్దలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒకింత శుభవార్తే చెప్పారు. ఈ నెల తర్వాత ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి తేల్చిచెప్పారు. దేశంలో ఉన్న 9,500 సినిమా హాళ్లలో కేవలం టికెట్ల అమ్మకంతోనే రోజుకు రూ. 30 కోట్లకు పైగా నష్టపోతున్నప్పటికీ లాక్‌డౌన్‌పై సినీరంగం సంఘీభావంగా ఉందని మంత్రి ప్రశంసించారు. రోజుకు 30 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని.. ఆ మేరకు భారీగా సష్టపోయినప్పటికీ లాక్‌డౌన్‌ నిర్ణయంపై సినీరంగం సంఘీభావంగా ఉండటాన్ని ఆయన ప్రశంసించారు. సినీ సంఘాల ప్రతినిధులు తన దృష్టికి తీసుకొచ్చిన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

మొత్తానికి చూస్తే.. థియేటర్స్ తెరుచుకోడానికి మాత్రం కచ్చితంగా మరికొన్ని రోజులు అయితే సమయం పడుతుందన్న మాట. మరోవైపు రోజురోజుకూ దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు. మరి దీన్ని బట్టి చూస్తే.. సినిమా థియేటర్లు ఏ మాత్రం తెరుచుకుంటాయో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయో వేచి చూడాల్సిందే.

More News

కరోనా పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన పాటలో హీరో నిఖిల్

కరోనా ప్రభావం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఈ విపత్కర వ్యాధి ప్రబలకుండా యావత్ దేశాలు శక్తీ మేర కృషి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం కొనసాగుతుంది.

బాలయ్య నిజ స్వరూపం బయటపెట్టిన ప్రముఖ నిర్మాత!

టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి ఇండస్ట్రీలో.. రాజకీయాల్లో చాలా మంది ఏవేవో అంటుంటారు.

హైదరాబాద్‌ను వణికిస్తున్న కరోనా.. భారీగా పెరిగిన కేసులు

తెలంగాణలో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. లాక్ డౌన్ 4.0 నుంచి కేసులు పెరిగిపోతున్నాయే తప్ప అస్సలే తగ్గే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు.

ఫైనాఫిల్ తిన్న ఏనుగు మృతి.. షేమ్ అన్న నవాజుద్దీన్

కేరళలో అమానుష ఘటన చోటుచేసుకుంది. గర్భంతో ఉన్న ఓ ఏనుగు ప్రాణాలను తీసాడు ఓ హంతకుడు. పూర్తి వివరాల్లోకెళితే.. మలప్పురం జిల్లాలో మే 27న జరిగిన ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

‘ఆర్ఆర్ఆర్‌’... భారీ సెట్‌

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’. దాదాపు 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.