కేంద్రం కీలక నిర్ణయం.. 12-14 ఏళ్ల వయసు వారికీ కరోనా వ్యాక్సిన్, ఆ రోజు నుంచే
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు భారత్ మరింత పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే దేశ ప్రజలకు రెండు డోసుల వ్యాక్సిన్‌ను అందజేసిన కేంద్రం.. ఒమిక్రాన్ నేపథ్యంలో బూస్టర్ డోసును కూడా అందుబాటులోకి తెచ్చింది. అదే సమయంలో జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు వున్న బాల, బాలికలకు వ్యాక్సిన్ అందజేయడాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో నరేంద్ర మోడీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
బుధవారం నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు టీకా పంపిణీని ప్రారంభించనున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. దీంతో పాటు ఇకపై 60 ఏళ్లు పైబడిన అందరికీ ప్రికాషనరీ డోసు పంపిణీ చేస్తామని వెల్లడించింది. 12-14 ఏళ్ల వారికి టీకా పంపిణీని ప్రారంభించేందుకు నేషనల్ టెక్నికల్ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ ఇప్పటికే కేంద్రానికి సిఫార్సులు చేసింది. ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసిన కేంద్రం.. బుధవారం నుంచి 12-14 ఏళ్ల వారికి టీకా పంపిణీని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న బయోలాజికల్ ఇ సంస్థ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్ టీకాను ఇవ్వనున్నట్లు పేర్కొంది.
కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 180.19 కోట్ల టీకా డోసులను పంపిణీ చేశారు. 15-18 వయసు వారిలో 5.58 కోట్ల మంది తొలి డోసు తీసుకోగా.. 3.38 కోట్ల మంది రెండు విడతల వ్యాక్సిన్ అందుకున్నారు. 60ఏళ్లు పైబడిన వారిలో 1.03 కోట్ల మంది ప్రికాషనరీ డోసు తీసుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com