సినిమా టికెట్స్ పై కనికరం చూపిన కేంద్రం..
- IndiaGlitz, [Monday,June 12 2017]
గత కొన్ని రోజులుగా సినిమా రంగంలో జరుగుతున్న డిస్కషన్స్‌లో జిఎస్‌టి ఓ భాగమైంది. అందుకు కారణం జిఎస్‌టి కారణంగా సినిమా టికెట్స్‌పై 28 శాతం పన్నుగా కేంద్రం విధిస్తుందని. ఇలా జిఎస్‌టి కారణంగా టికెట్ ధరపై భారీగా పెరిగితే అసలే కష్టాల్లో ఉన్న రీజనల్ సినిమా పరిశ్రమలపై పెరిగిన టికెట్ ధర ప్రభావం ఎక్కువగానే ఉంటుంది.
అసలే పైరసీ కారణంగా సినిమా పరిశ్రమ దారుణంగా దెబ్బ తిన్న ఈ పరిస్థితుల్లో జిఎస్‌టి కారణంగా సామాన్య ప్రేక్షకుడు దూరం అవుతాడని, ఎలాగైనా జిఎస్‌టి ఎఫెక్ట్ లేకుండా చేయాలని సినీ పెద్దలు అనుకున్నారు. అందరూ ఏమవుతుందో చూద్దామని అనుకుంటుండగానే కేంద్ర మంత్రి వర్గం మాత్రం సినిమా టికెట్స్ ధర విషయంలో పెద్దగా ఎఫెక్ట్ లేకుండా చర్యలు తీసుకుందట. 100 రూపాయల కంటే తక్కువ ధర ఉన్న టికెట్స్ పై 18 శాతం పన్ను, అంత కంటే ఎక్కువగా టికెట్ ధర ఉంటే 28 శాతం పన్ను పడుతుందట. ఈ రకంగా చూస్తే కొంత వరకు మేలే జరిగింది.