దక్షిణాదిలో రెండో రాజధానిపై తేల్చేసిన కేంద్రం
Send us your feedback to audioarticles@vaarta.com
దేశానికి హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేసే అవకాశం ఉందని గత కొన్ని రోజులు మీడియాలో కథనాలు.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హడావుడి జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ రెండో రాజధానిపై మాత్రం వార్తలు ఆగలేదు. దీంతో కేంద్రం ఏదో ఒకటి తేల్చేయాలని బుధవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రశ్నించారు.
క్లారిటీ ఇచ్చేసిన కేంద్రం!
దక్షిణ భారతదేశంలో దేశానికి రెండో రాజధాని అవసరమని ప్రభుత్వం భావిస్తుందా..? అని పరోక్షంగా హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిని చేసే ఆలోచన ఉందా..? అని ప్రశ్నించారు. ఇందుకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. దేశానికి రెండో రాజధాని ప్రతిపాదన ఏదీ లేదని ఆయన తేల్చిచెప్పారు.
కాగా.. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని.. దేశానికి రెండో రాజధాని చేస్తారని గత కొద్ది కాలంగా తీవ్రంగా ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. దేశానికి మధ్యలో ఉన్న హైదరాబాద్‌ను రెండో రాజధానిగా ప్రకటించడం వల్ల అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని.. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉండటంతో ఈ వాదన మరోసారి తెరమీదకు వచ్చింది. దీంతో తాజాగా కేంద్రం ఈ వ్యవహారం తేల్చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout