సరిహద్దులో ఉద్రిక్తత.. ఆర్మీకి రూ.500 కోట్లు
Send us your feedback to audioarticles@vaarta.com
త్రివిధ దళాల అవసరాల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లను కేటాయించింది. భారత్, చైనా మధ్య కొద్దిరోజులుగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యాధునిక యుద్ధ సామాగ్రిని సమకూర్చుకునేందుకు కేంద్రం త్రివిధ దళాలకు రూ.500 కోట్లను కేటాయించింది. అత్యవసర పరిస్థితి నిమిత్తమై ఎలాంటి ఆయుధాలనైనా కొనుగోలు చేసుకోవచ్చని కేంద్రం తెలిపినట్టు అధికారులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రక్షణ దళాలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించిన అనంతరం యుద్ధానికి అవసరమయ్యే ఆయుధాలను త్రివిధ దళాల అధికారులు సమకూర్చుకోనున్నారు. ఇప్పటికే దీనిపై త్రివిధ దళాలు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. కాగా సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై రక్షణశాఖా మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల అధికారులతో సమావేశయ్యారు. చైనాను ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధమవ్వాలని ఆయన అధికారులను సూచించారు. ఈ నేపథ్యంలో సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments