సరిహద్దులో ఉద్రిక్తత.. ఆర్మీకి రూ.500 కోట్లు

  • IndiaGlitz, [Sunday,June 21 2020]

త్రివిధ దళాల అవసరాల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లను కేటాయించింది. భారత్, చైనా మధ్య కొద్దిరోజులుగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యాధునిక యుద్ధ సామాగ్రిని సమకూర్చుకునేందుకు కేంద్రం త్రివిధ దళాలకు రూ.500 కోట్లను కేటాయించింది. అత్యవసర పరిస్థితి నిమిత్తమై ఎలాంటి ఆయుధాలనైనా కొనుగోలు చేసుకోవచ్చని కేంద్రం తెలిపినట్టు అధికారులు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రక్షణ దళాలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించిన అనంతరం యుద్ధానికి అవసరమయ్యే ఆయుధాలను త్రివిధ దళాల అధికారులు సమకూర్చుకోనున్నారు. ఇప్పటికే దీనిపై త్రివిధ దళాలు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. కాగా సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై రక్షణశాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాల అధికారులతో సమావేశయ్యారు. చైనాను ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధమవ్వాలని ఆయన అధికారులను సూచించారు. ఈ నేపథ్యంలో సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

More News

ఏపీలో నేడూ కొనసాగిన కరోనా విజృంభణ

ఏపీలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా తాజా కేసుల బులిటెన్‌ను విడుదల చేసింది.

ఈనాడు సిబ్బందికి కరోనా టెస్ట్.. షాకింగ్ రిజల్ట్

కరోనా మహమ్మారి నేడు అన్ని సంస్థలకూ పాకింది. ముఖ్యంగా కరోనాను అరికట్టడంలో ఫ్రంట్ లైన్‌లో ఉన్న వారిలో హెల్త్, పోలీస్, జీహెచ్ఎంసీతో పాటు మీడియా కూడా ఉంది.

కరోనాతో విజయ ఆస్పత్రి డైరెక్టర్ మృతి

చెన్నైలోని ప్రసిద్ధి గాంచిన విజయ ఆస్పత్రి డైరెక్టర్ శరత్ రెడ్డి(43) కరోనాతో చనిపోయారు. ఈ రోజు మధ్యాహ్నం విజయ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

నిజ ఘ‌ట‌న ఆధారంగా సినిమా అనౌన్స్ చేసిన వ‌ర్మ‌

నిజ ఘ‌ట‌న‌లు ఆధారంగా సినిమాలు చేయ‌డంలో రామ్ గోపాల్ వ‌ర్మ దిట్ట‌. 26/11 వంటి సినిమా ఆయ‌న తెర‌కెక్కించిన ఈ త‌ర‌హా చిత్రాల‌కు ఓ ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు.

ఈ సూర్యగ్రహణం కరోనాకు చెక్ పెట్టనుందా?

యోగా డేను కూడా మరిపించేలా దేశవ్యాప్తంగా రాహుగ్రస్త సూర్యగ్రహణం కొనసాగుతోంది. దాదాపు 4 గంటల పాటు ఉండే ఈ ఖగోళ అద్భుతం ఓ శుభవార్తను అందించింది.