కేంద్ర ప్రభుత్వానికే ఝలక్ ఇచ్చిన కేటుగాళ్లు..
- IndiaGlitz, [Wednesday,January 06 2021]
కేంద్ర ప్రభుత్వానికి ఝలక్ ఇవ్వాలంటే ఎన్ని గట్స్ ఉండాలి? కానీ ఇచ్చేశారు కొందరు కేటుగాళ్లు. ప్రభుత్వ యాప్స్‌ను పోలిన నకిలీ యాప్స్‌ను తయారు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచారు. విషయం తెలుసుకుని షాక్‌కు గురైన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెంటనే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమాయత్తమైంది. వెంటనే సోషల్ మీడియా వేదికగా విషయాన్ని వెల్లడించి.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏదైనా ఉంటే తామే చెబుతామని తొందరపడి ప్రజలు తమ వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ షేర్ చేసుకుని ఎంటర్‌టైన్ చేయవద్దని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన యాప్స్‌ను పోలిన నకిలీ యాప్స్‌ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. దీనిని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఆ నకిలీ యాప్స్‌ను చూసి మోసపోయి ప్రజలు తమ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సూచించింది. ‘‘#CoWIN’ పేరుతో ప్రభుత్వ యాప్స్‌ను పోలిన నకిలీ యాప్స్ యాప్ స్టోర్‌లో లభ్యమవుతున్నాయి. వీటిని డౌన్ లోడ్ చేసుకుని మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏదైనా యాప్స్‌ను లాంచ్ చేస్తే ప్రజలకు వాటిపై అవగాహన కల్పిస్తుంది’’ అని కేంద్రం వెల్లడించింది.