'కీచక' రెడీ ఫర్ రిలీజ్

  • IndiaGlitz, [Saturday,August 01 2015]

రివెంజ్ త్రిల్లర్ గా వినూత్నమైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కుతున్న కీచక చిత్రం నిర్మాణానంతర కార్య క్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిధ్ధమయింది. సెన్సార్ లో “ఏ” సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రానికి సెన్సార్ మెంబర్ల అభినందనలు లభించాయని నిర్మాత పర్వతరెడ్డి కిషోర్ కుమార్ తెలిపారు. చిత్రం హార్ష్ గా వయోలెంట్ గా ఉన్నప్పటికీ చాలా పర్పస్ ఫుల్ గా ఉందని వారు అన్నారని ఆయన చెప్పారు. మహిళలను ఇన్ స్పైర్ చేసే ఒక అద్భుతమైన సంఘటన ఆధారం గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. గత ఏడాది విడుదలై విమర్శకుల ప్రశంసలతో బాటు ఆస్కార్ లైబ్రరీ కి ఎంపికైన మిణుగురులు చిత్ర కథారచయిత ఎన్. వీ. బీ చౌదరి దర్శకత్వం లో తయారైన ఈ చిత్రం ఆడియో కార్యక్రమం త్వరలో జరగనుందని నిర్మాత తెలిపారు.

శ్రీ గౌతమీ టాకీస్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం లో యామినీ భాస్కర్, జ్వాలా కోటి, రఘుబాబు, నాయుడు, వినోద్, రోజా భారతి, మాధవి, మమతా రాహుత్ తదితరులు నటించగా డాక్టర్ జోస్యభట్ల అద్భుతమైన నాలుగు పాటలు అందించారని, రామ్ ప్రసాద్ యాదవ్ పదునైన సంభాషణలను రాయగా, కమలాకర్ కెమేరా బాధ్యతలు నిర్వహించారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎన్. వీ.బీ. చౌదరి అని నిర్మాత కిషోర్ పర్వత రెడ్డి తెలియజేశారు.

More News

'పాండవుల్లో ఒకడు' మూవీ రివ్యూ

తమిళ దర్శకుడు శంకర్ కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తుంటాడు. అలా ఆయన బ్యానర్ ఎస్ పిక్చర్స్ సమర్పణలో తమిళంలో విడుదలైన చిత్రమే కప్పల్. చిన్న చిత్రంగా అక్కడ విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న ఈ కామెడి ఎంటర్ టైనర్ ను మారుతి టీమ్ వర్స్ బ్యానర్ పై

గుణశేఖర్ కన్ను ఆ సామ్రాజ్యంపై పడింది...

గుణా టీమ్ వర్స్ బ్యానర్ పై దర్శక నిర్మాత గుణశేఖర్ రుద్రమదేవి పేరుతో తొలి హిస్టారికల్ త్రీడీ మూవీ నిర్మించాడు.

'సంఘ సంస్కర్త భగవద్రామానుజులు' ఆడియో విడుదల

కులమతవర్గములకు అతీతంగా అందరూ భగవంతుని పూజించి, భగవంతుని దివ్యానుగ్రహం పొందవచ్చు అని లోకమునకు చాటిన జగద్గురువులు భగవద్రామానుజులు.

అఖిల్ ఎంట్రీ డేట్ ఫిక్సయింది..

అక్కినేని అఖిల్ హీరోగా సుధాకర్ రెడ్డి, నితిన్ కలిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఓ చిత్రాన్ని రూపొందిస్తోన్న సంగతి విదితమే. వి.వి.వినాయక్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.

'బాహుబలి' పార్ట్ 2 టైటిల్...

టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీ బాహుబలి కలెక్షన్స్ ప్రభంజనం క్రియేట్ చేస్తోంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటికి 500 కోట్లకు దగ్గరవుతుంది.