'నోటా' కు సెన్సార్ బ్రేక్‌

  • IndiaGlitz, [Wednesday,October 03 2018]

విజ‌య్‌దేవ‌ర‌కొండ లెటెస్ట్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ 'నోటా' అక్టోబ‌ర్ 5న విడుద‌ల‌వుతుంది. ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో విజ‌య్‌దేవ‌ర‌కొండ యంగ్ సి.ఎం పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నారు. నోటా.. న‌న్ ఆఫ్ ది అబౌవ్ అనే ఓటింగ్ మెషిన్ ఆప్ష‌న్‌ను టైటిల్‌గా పెట్ట‌డంతో విడుద‌ల‌కు ముందు సినిమా టైటిల్‌పై అభ్యంత‌రాలు వ‌చ్చాయి.

ప్ర‌జ‌ల‌ను ఓటు వేయ‌వ‌ద్ద‌ని.. నన్ ఆఫ్ ది అబౌవ్ అప్ష‌న్‌ను సెల‌క్ట్ చేసుకోమ‌ని ప్రేరేపించేదిలా ఉందంటూ ... సినిమా ఓ రాజ‌కీయ పార్టీని స‌పోర్ట్ చేసేలా ఉందంటూ ... కేసులు వేశారు కూడా. అయితే సినిమాలో అలాందేమీ లేద‌ని హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ తేల్చేశాడు. సినిమా ప్రేక్ష‌కుల‌కు కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంద‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ చెప్పారు. అయితే నిన్న సినిమా చూసిన సెన్సార్ స‌భ్యులు ప‌లు క‌ట్స్‌ను, మ్యూట్ డైలాగ్స్‌ను సూచించార‌ట‌. ఇప్పుడు వాటిని తొల‌గించే ప‌నిలో యూనిట్ బిజీగా ఉంది.

More News

కౌశ‌ల్‌కు మ‌హేశ్ అభినంద‌న‌...

బిగ్‌బాస్ సీజ‌న్ 2లో కౌశ‌ల్ విజేత‌గా నిలిచాడు. బిగ్‌బాస్ స్టార్ట‌యిన కొన్ని రోజుల‌కే.. చాలా ఉత్కంఠ‌తో న‌డిచింది. ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై చాలా ఆస‌క్తిరేగింది.

మూడు వేరియేష‌న్స్‌తో ఆక‌ట్టుకున్న ఎన్టీఆర్‌...

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం 'అర‌వింద స‌మేత‌'... వీర రాఘ‌వ‌...

క‌న్నీళ్లు పెట్టుకున్న ఎన్టీఆర్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం 'అర‌వింద స‌మేత‌'. అక్టోబ‌ర్ 11న సినిమా విడుద‌ల కానుంది.

బిగ్‌బాస్‌పై నాని స్పంద‌న‌...

బిగ్‌బాస్ సీజ‌న్ 2కు నాని వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ సీజ‌న్‌లో నాని వ్యాఖ్యానంపై ... త‌న ప్ర‌వ‌ర్త‌న‌పై చాలా ర‌కాలైన విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నాడు నాని.

వెండితెర‌పై కౌశ‌ల్‌...

బిగ్‌బాస్ సీజ‌న్ 2లో విన్న‌ర్ కౌశ‌ల్‌... ఇప్ప‌టి వ‌ర‌కు బుల్లితెర‌పై సంద‌డి చేస్తూ వ‌చ్చిన కౌశ‌ల్‌కు బిగ్‌బాస్ సీజ‌న్ 2లో నెగ్గ‌డం మంచి క్రేజ్‌ను తెచ్చి పెట్టింది.