అమ‌రావ‌తిలో సెన్సార్ బోర్డ్‌

  • IndiaGlitz, [Saturday,August 25 2018]

తెలుగులో మ‌రో సెన్సార్ బోర్డ్ రానుంది. ప్ర‌స్తుతం తెలుగువాళ్లు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా.. సినిమా అంతా హైద‌రాబాద్‌లోనే కేంద్రీకృత‌మై ఉంది. ఇప్పుడు ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వం తెలుగు సినిమాల‌ను ఆక‌ర్షించుకునే ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టింది.

అందులో భాగంగా నాలుగు కోట్ల‌లో తీసే సినిమాల‌కు ప‌న్ను రాయ‌తీలు ఇవ్వ‌డంతో పాటు.. ప‌దిహేను ఉత్త‌మ చిత్రాల‌కు ప‌ది నుండి ప‌దిహేను ల‌క్ష‌ల రూపాయ‌ల న‌గ‌దు ప్రోత్స‌హ‌కాన్ని కూడా అందించ‌బోతున్నారు. అందులో భాగంగా అమ‌రావ‌తిలో ఓ ప్రాంతీయ సెన్సార్ బోర్డును స్థాపించాలనుకుంటున్నార‌ట‌. ప్రాసెస్ ఆల్‌రెడీ స్టార్ట్ అయ్యింద‌ట‌.