ఆర్జీవీ ‘కమ్మరాజ్యానికి’ సర్టిఫికెట్ రద్దు చేసిన సెన్సార్ బోర్డ్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ వివాదాల్లో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సెన్సార్ బోర్డు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వమని.. రద్దు చేస్తున్నట్లు సెన్సార్ బోర్డు తేల్చిచెప్పేసింది. ఈ సినిమా వివాదాస్పదంగా ఉందని.. కొన్ని కులాల ప్రజలను రెచ్చగొట్టేలా ఉందని పలువురు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు మాత్రం రిలీజ్ చేయడానికి కుదరదని ఇప్పటికే షాకివ్వగా.. తాజాగా సెన్సార్ బోర్డు మాత్రం మరో కోలుకోలేని షాకిచ్చింది.
సర్టిఫికెట్ రద్దు.. వాట్ నెక్స్ట్!
న్యాయవాది బాలాజీ యాలమంజుల, ఇంద్రసేన చౌదరిలు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం విదితమే. ఆ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకుని ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని హైకోర్టు భావించింది.! ఈ మేరకు సెన్సార్ బోర్డుకు ఇప్పటికే సినిమా పూర్తిగా చూసి సర్టిఫికెట్ సంగతేంటో చూడాలని అదేశాలు జారీ చేసింది. దీంతో సినిమా చూసిన అనంతరం అభ్యంతకర సన్నివేశాలు ఉండటంతో సర్టిఫికెట్‌ను రద్దు చేస్తున్నట్లు సెన్సార్ బోర్డు తెలిపిందని న్యాయవాది బాలాజీ మీడియాకు వెల్లడించారు. మరి ఈ వ్యవహారంపై ఆర్జీవీ ఎలా రియాక్ట్ అవుతారో..? థియేటర్లలో రిలీజ్ చేయడానికి కుదరదు గనుక.. అప్పట్లో జీఎస్టీ రిలీజ్ చేసినట్లుగానే ఇది కూడా యూ ట్యూబ్‌లోనే విడుదల చేస్తారో ఏంటో మరి.
సంచలన వ్యాఖ్యలు..!
కాగా.. సెన్సార్ అనేది ఔట్ డేటెడ్ ఇన్ స్టిట్యూషన్ అని సెన్సార్ బోర్డుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ‘ఈ సినిమాలో ఏ కులాన్నీ తక్కువ చేయలేదు. అంతా రూల్స్ ప్రకారం చేస్తే, ఏ సినిమా తీయలేం, విడుదలకాదు. సెటైర్ చేయడం కోసమే ఈ సినిమా తీశాను. ఏ పార్టీ కోసమో, వ్యక్తి కోసమో ఈ సినిమా తీయలేదు. అందుకే నేను ఈ సినిమాకు సీక్వెల్ కూడా తీస్తున్నాను’ అని ఇదివరకే ప్రకటన చేశారు. అంతేకాదు.. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’కు బదులుగా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అని మారుస్తానని ఇప్పటికే ఆర్జీవీ స్పష్టం చేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments