ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ.. ప్రాజెక్ట్స్ అప్టేడ్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నేడు 41వ ఏటలో అడుగుపెట్టారు. దీంతో తారక్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 'హ్యాపీ బర్త్‌డే డియర్ ఎన్టీఆర్' అంటూ చరణ్ ట్వీట్ చేయగా.. 'హ్వాపీ బర్త్‌డే తారక్ బావ.. ఫియర్ ఈజ్ ఫైర్' అంటూ బన్నీ విషెస్ తెలిపారు. ఇక ప్రిన్స్ మహేష్ బాబు కూడా 'హ్యాపీ బర్త్‌డే తారక్.. ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు" ట్వీట్ చేశారు. అలాగే హీరో మంచు మనోజ్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. నువ్వెక్కడున్నా చల్లగా ఉండాలి బాబాయ్ అంటూ ఎన్టీఆర్‌పై తన ఆత్మీయతను చాటుకున్నారు.
మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'ఈ ఏడాది దేవుడు మీకు మంచి ఆరోగ్యం, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశారు. దీంతో లోకేష్ ట్వీట్ వైరల్‌గా మారింది. ఎందుకంటే గతంలో టీడీపీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతేడాది చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో కూడా తారక్ కనీసం స్పందించలేదు. దీంతో వీరి మధ్య గ్యాప్ వచ్చిందనే టాక్ నడిచింది. ఇలాంటి తరుణంతో తారక్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ లోకేష్ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది.
Heartfelt birthday wishes to @tarak9999. May God bless you with good health and happiness.
— Lokesh Nara (@naralokesh) May 20, 2024
వీరితో పాటు మరికొంత మంది ప్రముఖులు కూడా ఎన్టీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'దేవర' చిత్రం నుంచి రిలీజైన ఫియర్ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. "దూకే ధైర్యమా... జాగ్రత్త... రాకే, తెగబడి రాకే... దేవర ముంగిట నువ్వెంత" అంటూ సాగే ఈ పవర్ ఫుల్ గీతానికి అనిరుధ్ రవిచందర్ బాణీలు సమకూర్చగా రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.
ఇదిలా ఉంటే తారక్ పుట్టినరోజు సందర్భంగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ ఆగష్టు 2024 నుంచి షూటింగ్ మొదలుకానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రశాంత్.. ప్రస్తుతం సలార్-2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే తారక్ మూవీని సెట్స్‌పైకి తీసుకురానున్నాడు. ఇక ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్ అభిమానులకు పండగే అని చెప్పాలి. ఈ సినిమాలతో పాటు బాలీవుడ్‌తో తెరకెక్కుతోన్న 'వార్2' సినిమాలోనూ తారక్ నటిస్తున్నారు. మొత్తానికి వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు ఎన్టీఆర్ రెడీ అయ్యారనే చెప్పాలి.
Happiest birthday to my dearest @tarak9999 pic.twitter.com/yocPcidL08
— Ram Charan (@AlwaysRamCharan) May 20, 2024
Many many happy returns of the day Bava … FEAR is FIRE 🔥🔥🔥 @tarak9999
— Allu Arjun (@alluarjun) May 20, 2024
Happy birthday @tarak9999! Wishing you a year full of joy and success! 😊
— Mahesh Babu (@urstrulyMahesh) May 20, 2024
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com