నేడు కేసీఆర్ పెళ్లి రోజు.. వెల్లువలా శుభాకాంక్షలు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతుల పెళ్లిరోజు ఇవాళ. అంతేకాదు జోగునపల్లి రవీందర్ రావుది కూడా ఇవాళే పెళ్లిరోజు. రవీందర్ రావు.. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగునపల్లి సంతోష్ కుమార్ తండ్రి. కాగా.. కేసీఆర్, రవీందర్ రావు ఇద్దరూ ఒకే కుటుంబంలో పెళ్లి చేసుకున్నారు. కేసీఆర్ సతీమణి శోభ, రవీందర్ రావు సతీమణి శశికళ ఇద్దరూ అక్కా చెల్లెళ్లు. 1954 ఫిబ్రవరి 17న పుట్టిన కేసీఆర్ 1969 ఏప్రిల్ 23న శోభను పెళ్లాడారు. పెళ్లినాటికి కేసీఆర్ వయసు 15 ఏళ్లు మాత్రమే. అప్పట్లో బాల్య వివాహాలు ఎక్కువగా ఉండేవి. అంతేకాదు.. కేసీఆర్ సోదరుడు (కో-బ్రదర్) కూడా అదే రోజునే బాల్య వివాహాం చేసుకున్నారు. అంటే ఇద్దరిదీ ఒకే పెళ్లి రోజు అన్న మాట. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కేసీఆర్‌కు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవూపు ఆదర్శ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు అని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ మ్యారేజ్ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
నా అదృష్టం..!
ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ తన ట్విట్టర్ వేదికగా తన తల్లిదండ్రులకు, కేసీఆర్‌కు యానివర్శరీ శుభాకాంక్షలు తెలిపారు. ‘మీలాంటి తల్లిదండ్రులుండటం మా అదృష్టం.. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పెదనాన్న, పెద్దమ్మ. నా జీవితంలో అత్యంత విలువైన వ్యక్తులు మీరే. మీ రెండు జంటలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం జీవించాలని కోరుకుంటున్నాను’ అని సంతోష్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్, రవీందర్ రావుల పెళ్లినాటి ఫొటో.. ఆ తర్వాత వాళ్లిద్దరూ ఉండే ఫొటోను జతపరిచారు. ఆయన ట్వీట్‌ను అభిమానులు, కార్యకర్తలు, పలువురు నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతూ షేర్ చేస్తున్నారు. నెట్టింట్లో వెల్లువలా శుభాకాంక్షలు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments