గొల్లపూడి మృతిపట్ల ప్రముఖుల సంతాపం
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మృతిపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొల్లపూడి మరణవార్త తెలుసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. నటుడిగా వినూత్నమైన డైలాగ్ డెలివరీతోపాటు, రచయితగా, వ్యాఖ్యాతగా, సంపాదకుడిగా గొల్లపూడి సేవలు ప్రశంసనీయమని.. ఆయన లేని లోటు తీర్చలేనిదని జగన్ కొనియాడారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గొల్లపూడి సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో గర్వించదగిన స్థానాన్ని సంపాదించారన్నారు.
ఎన్నో సేవలు చేశారు!
నటుడు గొల్లపూడి మారుతీరావు మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. గొల్లపూడి కుటుంబసభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు సినిమా రంగానికి గొల్లపూడి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. గొల్లపూడి రచనలు తెలుగు భాషా అభివృద్ధికి దిశానిర్దేశం చేశాయని అని కేసీఆర్ గుర్తుచేశారు.
తీరనిలోటు..!
గొల్లపూడి మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, సాహితీ లోకానికి తీరనిలోటని అన్నారు. గొల్లపూడి కుటుంబసభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢసానుభూతి తెలిపారు.
ఆరు నంది అవార్డులు అందుకున్నారు!
సీనియర్ నటుడు శ్రీ గొల్లపూడి మారుతీ రావు మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రచయిత, వ్యాఖ్యాతగా కూడా గొల్లపూడి మారుతీ రావు రాణించారని గుర్తు చేశారు. సుమారు 250 కి పైగా చిత్రాలలో నటించిన ఆయన 6 నంది అవార్డులు అందుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎంతో గుర్తింపు పొందారు. ఈయన మృతితో చిత్ర పరిశ్రమ ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
టాలీవుడ్‌లో విషాదఛాయలు!
కాగా.. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం నాడు తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన తిరిగిరాని లోకాలకు చేరుకోవడంతో టాలీవుడ్‌లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. మారుతీరావు మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు సోషల్ మీడియా, మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments