close
Choose your channels

రాము తీస్తానంటే శివ 2 చేయడానికి నేను రెడీ - నాగార్జున

Tuesday, December 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం వంగ‌వీటి. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన య‌ధార్ధ సంఘ‌ట‌న‌లు ఆధారంగా వంగ‌వీటి చిత్రాన్ని వ‌ర్మ తెర‌కెక్కించారు. ఈ సంచ‌ల‌న చిత్రం ఈనెల 23న రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా శివ టు వంగ‌వీటి ది జ‌ర్నీ ఆఫ్ రామ్ గోపాల్ వ‌ర్మ అనే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఈరోజు హైద‌రాబాద్ జెఆర్ సీ క‌న్వెష‌న్ హాల్ లో ఏర్పాటు చేసారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా నాగార్జున వెంక‌టేష్ హాజ‌ర‌య్యారు.
ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ ర‌చ‌యిత త‌నికెళ్ళ‌భ‌ర‌ణి మాట్లాడుతూ.... రామ్ గోపాల్ వ‌ర్మ అనేది చ‌ల‌న చిత్ర‌ చ‌రిత్ర‌లో ఒక స్టాంప్. వ‌ర్మ‌తో నాకు ఇన్నాళ్లుగా ప‌రిచ‌యం ఎప్ప‌టికీ మ‌రువ‌లేను. శివ - వంగ‌వీటి క‌లిస్తే శివంగి అంటే ఆడ‌పులి. వ‌ర్మ పులుల్లో కూడా ఆడ‌పులినే ప్రేమిస్తాడు. వంగ‌వీటి విజ‌యం సాధించాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ మాట్లాడుతూ... నేను డైరెక్ట‌ర్ అవ్వ‌డానికి కార‌ణం వ‌ర్మ‌గారు. నాకు వ‌ర్మ గారు ఎప్పుడూ హీరోలా క‌నిపిస్తారు. చాలా మందికి వ‌ర్మ గారు డైరెక్ట‌ర్ కానీ...నాకు ఆయ‌న‌ హీరో. ఏ హీరో డైలాగ్ తీసుకున్నా అది వ‌ర్మ గారికి క‌రెక్ట్ గా స‌రిపోతుంది. నాకు కొంచెం తిక్క ఉంది దానికో లెక్క ఉంది ఈ డైలాగ్ వ‌ర్మగారికి క‌రెక్ట్ గా స‌రిపోతుంది. నేను ఏదోలా బ‌తికేయ‌డానికి రాలేదు ముంబాయిని ఉచ్చ‌ పోయించ‌డానికి వ‌చ్చాను ఈ డైలాగ్ కూడా వ‌ర్మ గారికి క‌రెక్ట్ గా స‌రిపోతుంది. సినిమాలును మించి ఎదిగారు వ‌ర్మ‌గారు. ఎలా ప‌డితే అలా బ‌త‌కే మ‌నిషి వ‌ర్మ గారు. ఆయ‌న‌లా బ‌త‌కాలి అనుకుంటారు కానీ..ఎవ‌రికీ కుద‌ర‌దు అన్నారు.
గుణ‌శేఖ‌ర్ మాట్లాడుతూ... శివ నుంచి వంగ‌వీటి వ‌ర‌కు కాదు...వ‌ర్మ గారి ప్ర‌యాణం ఇంకా ఇంకా ముందు సాగాల‌ని అని కోరుకుంటున్నాను. ఆయ‌న‌తో పాటు 2 అడుగులు వేసే అవ‌కాశం క‌లిగింది. ఆయ‌న సినిమాలు చూసి ఇంకా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం. వంగ‌వీటి తెలుగులో వ‌ర్మ గారి ఆఖ‌రి చిత్రం కాదు...వ‌ర్మ గారు తెలుగులో సినిమాలు తీయ‌డం ఆపేస్తే నిరాహార దీక్ష చేస్తాం. శివ చూసి ఎలాగైతే ఇన్ స్పైయిర్ అయ్యామో వంగ‌వీటి చిత్రం కూడా మ‌మ్మ‌ల్ని ఇన్ స్పైయిర్ చేసేలా ఉంటుంది అని ఆశిస్తున్నాను అన్నారు.
హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ... శివ రిలీజ్ అయిన‌ప్పుడు యూత్ పై బాగా ప్ర‌భావం చూపించింది. ఇప్ప‌టి వ‌ర‌కు లైఫ్ లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌తో వ‌ర్మ గారు సినిమాలు తీసారు. ఫ్యూచ‌ర్ లో వ‌ర్మగారి మీద సినిమాలు తీస్తారు అనుకుంటున్నాను. నేను విజ‌య‌వాడ‌లోనే పెరిగాను. అక్క‌డ జ‌రిగిన గొడ‌వ‌ల‌ను చిన్న‌ప్పుడు చూసాను ఆ టైమ్ లో టెర్రిఫైడ్ ఫీలింగ్ క‌లిగింది. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను అన్నారు.
వై.వి.ఎస్ చౌద‌రి మాట్లాడుతూ.... సినిమా ఫీల్డ్ కి రావ‌డం అదృష్టం అంటారు. ఈ స్టేజ్ పై మాట్లాడ‌డం ఇంకా అదృష్టం అంటాను. నేను ఎన్టీఆర్ స్పూర్తితో ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. నాకు త‌ల్లిదండ్రులు జ‌న్మ‌నిస్తే... ద‌ర్శ‌కుడిగా జ‌న్మ‌నిచ్చింది నాగార్జున గారు. నాగార్జున గార్కి జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను. నాగార్జున గారికి సెల్యూలాయిడ్ సైంటిస్ట్ అని పేరు పెట్టుకున్నాను. నాగార్జున గార్కి కొత్త వాళ్ల‌ను ప‌రిచ‌యం చేయ‌డానికి శ‌క్తి ఇచ్చింది రామ్ గోపాల్ వ‌ర్మ గారు. నాగార్జున గారు మ‌నిషిని మ‌నిషిగా చూస్తారు. ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు తీయ‌డానికి ధైర్యం ద‌మ్ము వ‌ర్మ గారికి ఉన్నాయి. గోవిందా గోవిందా సినిమాకి వ‌ర్మ గారి ద‌గ్గ‌ర‌ వ‌ర్క్ చేసాను. తెలుగులో వ‌ర్మ గారు ఖ‌చ్చితంగా మ‌రో సినిమా తీస్తారు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన‌ గొడ‌వ‌లు క‌థాంశంగా వంగ‌వీటి సినిమా తీసారు. ఇలాంటి సినిమాలు తీయ‌డం వ‌ర్మ గారికి వెన్న‌తో పెట్టిన విద్య‌. ఈ సినిమాలో అభ్యంత‌రక‌ర స‌న్నివేశాలు ఉంటాయ‌ని ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. వంగ‌వీటి పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
వంశీ చాగంటి మాట్లాడుతూ... ఈ చిత్రంలో దేవినేని ముర‌ళి పాత్ర పోషించాను. ఈ సినిమా నాకు డ్రీమ్ రీ లాంఛ్ లాంటిది. అగ్నికి ఆజ్యం పోయ‌డం అంటాం క‌దా. వ‌ర్మ గారు అగ్ని అయితే మా నిర్మాత‌ దాసరి కిర‌ణ్ గారు ఆజ్యం. ఈ సినిమా వండ‌ర్ ఫుల్ గా వ‌చ్చింది. అంద‌రికీ న‌చ్చుతుంది అనుకుంటున్నాను అన్నారు.
డైరెక్ట‌ర్ బి.గోపాల్ మాట్లాడుతూ... శివ సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. శివ రిలీజ్ త‌ర్వాత సైకిల్ చైన్ స్టైల్ అయ్యింది. రాము స్ట‌డీ కామ్, సౌండ్ కి ఇంపార్టెన్స్ తీసుకువ‌చ్చాడు. మా రాము ఓ అద‌ర్భుత‌మైన డైరెక్ట‌ర్. ఎన్నో సూప‌ర్ హిట్స్ తీసాడు. ఇంకా చాలా సినిమాలు తీయాలి. రాము ను చూసి గ‌ర్వ‌ప‌డ‌తాం. భ‌గ‌వంతుడు రాముని గొప్ప సినిమాలు తీయమ‌ని ఈ భూమి మీద‌కు పంపించాడు అనుకుంటాను. రాము సినిమాలు తీయ‌డం మానేస్తే నీ శిష్యులు అంద‌రితో క‌లిసి సైకిల్ చైన్ లు తీసుకుని నీ ఇంటికి వ‌స్తాం. నా రాము స‌క్సెస్ క్రెడిట్ నాగార్జున గారుకు చెందుతుంది. చాలా మంది ద‌ర్శ‌కుల‌కు లైఫ్ ఇచ్చిన దేవుడు నాగార్జున గారు. వంగ‌వీటి పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అన్నారు
బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ... స్టూడెంట్స్ గా ఉన్న‌ప్పుడు శివ చూసాం. మ‌మ్మ‌ల్ని ఎంత‌గానో ఇన్ స్పైయిర్ చేసారు. ఒక గాడ్ ఫాద‌ర్ ని అయినా స‌రే అద్భుతంగా చూపించాలి అంటే వ‌ర్మ గారి త‌ర్వాతే. శివ చూసిన‌ప్పుడు చాలా మంది స్టూడెంట్స్ పై ప్ర‌భావం ప‌డింది. శివ వ‌ర్మ గారి ఫ‌స్ట్ సినిమా ఇది నిజం. వంగ‌వీటి వ‌ర్మ గారి ఆఖ‌రి సినిమా కాదు ఇది అబ‌ద్దం అన్నారు.

డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ... వ‌ర్మ గారి గురించి తెలుసు కూడా అలా అడ‌గ‌డం త‌ప్పు. శివ సినిమా వ‌చ్చిన‌ప్పుడు నేను 6వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాను. శివ సినిమాలో సైకిల్ చైన్ తీయ‌గ‌నే థియేట‌ర్స్ లో విజుల్స్. చిన్నా రాడ్ ఇవ్వారా అన‌గానే విజిల్స్..శివ అనే మాట విన‌బ‌డితే చాలు విజిల్సే. ప్ర‌తి డైరెక్ట‌ర్ మీద వ‌ర్మ గారి ప్ర‌భావం ఉంది అన్నారు.
నిర్మాత పివిపి మాట్లాడుతూ.... వంగ‌వీటి సినిమా చూసాను. ఈ సినిమాలో ప్ర‌తి సీన్ ని చాలా డీటైల్ గా చెప్పారు. 30 సంవ‌త్స‌రాల విజ‌య‌వాడ‌ హిస్ట‌రీని తెర‌కెక్కించినందుకు వ‌ర్మ‌గార్కి థ్యాంక్స్ అన్నారు.
పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ.... ఇండ‌స్ట్రీకి ఒక్క‌డు వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టించాడు వాడే రామ్ గోపాల్ వ‌ర్మ‌. నేను 25 ఏళ్లుగా రాము గారితో కాపురం చేస్తున్నాను అయినా ప్రేమ త‌గ్గ‌లేదు. వంగ‌వీటి సినిమా 40 నిమిషాలు చూసాను. అద్భుత‌మైన సినిమా. కొన్ని సీన్స్ చూస్తుంటే క‌ళ్లంట నీళ్లు వ‌చ్చాయి. విజ‌య‌వాడ వాళ్లు ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఈ సినిమాలో న‌టించిన వాళ్లు సూప‌ర్ స్టార్ లు అవుతారు అన్నారు.
టి.డి.పి నాయ‌కుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... రాము గారి సినిమాలు శివ చూస్తే శివ అవ్వాలి అనిపిస్తుంటుంది. స‌త్య సినిమా చూస్తే జెడి చ‌క్ర‌వ‌ర్తి అవ్వాలి అనిపిస్తుంటుంది. స‌ర్కార్ చూస్తే అమితాబ్ లా ఉండాలి అనిపిస్తుంటుంది. అంతలా రాము గారి సినిమాలు ప్ర‌భావం చూపిస్తాయి. రాము గారు తెలుగులో సినిమాలు తీయాల్సిందే మ‌నం చూడాల్సిందే. వంగ‌వీటి యూనిట్ కు నా శుభాకాంక్ష‌లు అన్నారు.
రాజ‌మౌళి మాట్లాడుతూ... రాము గారికి అసిస్టెంట్ డైరెక్ట‌ర్స్ గుడ్ మార్నింగ్ చెప్ప‌డం ఇష్టం ఉండ‌దు. హైద‌రాబాద్ వ‌చ్చిన త‌ర్వాత రాము గారిని క‌ల‌వాల‌ని... ఆయ‌న‌కు గుడ్ మార్నింగ్ చెప్ప‌డం ఇష్టం ఉండ‌దు క‌దా...అలా చెప్ప‌కుండా హాలో సార్..అని విష్ చేయ‌డం ఎలా అని ఓ 100 సార్లు ప్రాక్టీస్ చేసాను. రాము గారు శివతో ఎంతో మందిని ఇన్ స్పైర్ చేసారు. ఆయ‌న సినిమాలు తీసి తీసి మ‌ధ్య‌లో ఐస్ క్రీమ్, అడ‌వి అంటూ సినిమాలు తీసారు. రాము గారితో అంత‌గా ప‌రిచ‌యం లేదు. గ‌త మూడేళ్లుగా డైరెక్ట్ గా ప‌రిచ‌యం ఉంది. అయితే...ఐస్ క్రీమ్ లాంటి సినిమాలు ఎందుకు తీస్తారు అని అడిగాను. దానికి ఏదో చెప్పారు కానీ అర్ధం కాలేదు. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే... రాము గారు ఈ సినిమాని ప్ర‌మోట్ చేస్తున్నారు. చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత ఆయ‌న ప్రేమించి తీసిని సినిమా అనిపిస్తుంది. ఆర్ జీ వి ఈజ్ బ్యాక్ అనిపిస్తుంది.వంగ‌వీటి ఈజ్
బ్యాక్. ఈ సినిమాలోని పాట‌ల్లో మ‌ర‌ణం సాంగ్ చాలా బాగుంది. సాంగ్స్ విజువ‌ల్స్ న‌న్నునిజంగా ట‌చ్ చేసాయి. వంగ‌వీటి బిగ్ హిట్ అవ్వాల‌ని ఆశిస్తున్నాను. ట్రైల‌ర్ చూస్తుంటే ఓరిజిన‌ల్ క్యారెక్ట‌ర్స ని చూసిన ఫీల్ క‌లుగుతుంది అన్నారు.
విక్ట‌రీ వెంక‌టేష్ మాట్లాడుతూ... వంగ‌వీటి ట్రైల‌ర్ అవుట్ స్టాండింగ్ గా ఉంది. శివ సినిమా త‌ర్వాత నాతో శివ లాంటి సినిమానో, దాని బాబు సినిమానో తీస్తాడు అనుకుంటే వేరే జోన‌ర్ లో క్ష‌ణ‌క్ష‌ణం తీసాడు. నాగ్ తో చైన్ ప‌ట్టించాడు. నా సినిమాలో న‌న్నుప‌క్క‌న‌ కూర్చొబెట్టి సాంగ్ అంటూ శ్రీదేవితోనే షూటింగ్ చేసేవాడు. నువ్వు ఫీల‌య్యావా అని అడిగాడు లేదు ఎంజాయ్ చేసాను అని చెప్పాను. మిగిలిన హీరోలంద‌రం ఎన్ని ఫైట్స్ చేసినా నాగ్ గారు ఒక్క ఛైన్ తీసి మొత్తం కొట్టేసాడు. శివ త‌ర్వాత నుంచి ఫైట్స్ స్టైలే మారిపోయింది. రాముతో వండ‌ర్ ఫుల్ జ‌ర్నీ అన్నారు.
రామ్ గోపాల్ వ‌ర్మ మాట్లాడుతూ... అమితాబ్ జీ రావాలి కానీ..ఫ్లైట్ ప్రాబ్ల‌మ్ వ‌ల‌న రాలేక‌పోయారు. నా లైఫ్ లో ముఖ్య‌మైన‌ అమితాబ్ - నాగార్జున ఇద్ద‌రిని ఒకేసారి చూస్తాను అనుకున్నాను. అమితాబ్ జీ రాక‌పోయినా నాగార్జున ఇక్క‌డ ఉన్నందుకు స‌గం సంతోషంగా ఉంది. వంగ‌వీటి అనేది నేను విజ‌య‌వాడలో ఇంజ‌నీరింగ్ కాలేజీ ఉన్న‌ప్పుడు చూసిన సంఘ‌ట‌న‌ల‌తో పాటు మ‌రికొన్ని సంఘ‌ట‌న‌లు గురించి తెలుసుకుని ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాను. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన గొడ‌వ‌ల నేప‌ధ్యంతో శివ తీసాను కానీ...శివ సినిమాకి వంగ‌వీటికి సంబంధం లేదు. వంగ‌వీటి సినిమాని అప్పుడు కాకుండా ఇప్పుడు తీయ‌డానికి కార‌ణం... ఈ సినిమా తీయాలి అని అప్పుడు మైండ్ లో లేదు. రాజ‌మౌళితో ఒక‌ రోజు వంగ‌వీటి నా స్పెష‌ల్ ఫిల్మ్ అంటే...ఎన్నిసార్లు చెప్ప‌లేదు అన్న‌ట్టు ఒక ఎక్స్ ప్రెస్ ని ఇచ్చాడు. ఈ చిత్రంలో ఎంత చిన్న రోల్ అయినా స‌రే ఆ క్యారెక్ట‌ర్ గురించి డీటైల్ గా ఉంటుంది. క్ష‌ణ‌క్ష‌ణం సినిమాలో అంద‌నంత‌ తార తీరం..సంగ‌తేందో చూద్దాం రా....అనే సాంగ్ షూటింగ్ చేస్తుంటే వెంకీ, శ్రీఈదేవి డ్యాన్స్ చేస్తున్నారు. నేను ఓకే అని చెప్పాను కానీ డ్యాన్స్ మాస్ట‌ర్ వ‌న్ మోర్ అన్నాడు. త‌ర్వాత కూడా నేను ఓకే అంటే డ్యాన్స్ మాస్ట‌ర్ వ‌న్ మోర్ అన్నాడు. బాగానే వ‌చ్చింది క‌దా...ఎందుకు వ‌న్ మోర్ అని డ్యాన్స్ మాస్ట‌ర్ అసిస్టెంట్ అని అడిగితే...మీరు శ్రీదేవిని చూస్తున్నారు. ఆయ‌న వెంక‌టేష్ ని చూస్తున్నారు అని చెప్పారు.
అది క్ష‌ణ‌క్ష‌ణం షూటింగ్ లో మ‌ర‌చిపోలేని సంఘ‌ట‌న‌.నాగార్జున గురించి చెప్పాలంటే... ఇండియాలోనే ఎలాంటి ఎక్స్ పీరియ‌న్స్ లేకుండా సినిమా తీయ‌డానికి నాకు డైరెక్ట‌ర్ గా నాగార్జున అవ‌కాశం ఇవ్వ‌డం జ‌రిగింది. అప్పుడు చెన్నైలో ఏదో స్ట్రైక్ జ‌రుగుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయాలి అంటే ఇళ‌య‌రాజా గారు ముంబాయిలో చేద్దాం అన్నారు. అప్పుడు నాగార్జున‌కి చెబితే కావాలంటే నా రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌ద్దు రాముకి కావాల్సింది ఇవ్వండి అని ఎంత‌గానో న‌న్ను స‌పోర్ట్ చేసారు. ప్ర‌పంచంలోనే నాగార్జున లాంటి హీరో నిర్మాత మ‌రొక‌రు లేరు. రాజ‌మౌళి అడిగిన ఐస్ క్రీమ్ సినిమాలు ఎందుకు అనేదానికి స‌మాధానం చెప్పాలి అంటే...నువ్వు అన్నీ బాగా చూసి సినిమాని వ‌దులుతావు. నేను అదే ఆడేస్తుంది అనుకుని సినిమాని రిలీజ్ చేస్తాను. ఇక నుంచి నీమీద‌, నాగార్జున మీద ఓట్టు ఏసి చెబుతున్నాను ఇక నుంచి నా సినిమాలు గుర్తుండేలా ఉంటాయి అన్నారు.
కింగ్ నాగార్జున మాట్లాడుతూ.... అమితాబ్ బ‌చ్చ‌న్ గారు ఈ ఫంక్ష‌న్ కి రావాలి కానీ...ఫ్లైట్ ప్రాబ్ల‌మ్ ఇవ్వ‌డం వ‌ల‌న ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లిపోయారు. ఏక్ట‌ర్స్ అంద‌రూ ఎంతో కొంత అమితాబ్ గార్ని రీచ్ అవ్వాల‌ని ట్రై చేస్తుంటాం. ఆయ‌న నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. రాము నాకు ఒక‌ బ్ర‌ద‌ర్ లా..ఒక ఫ్రెండ్ లా ఫీల‌వుతుంటాను. అన్నింటికంటే నాకు రాము ఫ్రెండ్ గా బాగా ఇష్టం. నాకు క‌థ చెబుతానని వ‌చ్చిన‌ప్పుడు వాడ్కా తాగి త‌ర్వాత క‌థ చెప్పేవాడు. అంతం క‌థ చెప్పేట‌ప్పుడు క‌త్తితో పొడిచే సీన్ ఏక్ట్ చేసి మ‌రీ చూపించాడు. ప్ర‌తిదీ ఫీలై చెబుతాడు. శివ సినిమాతో నేనేదో బ్రేక్ ఇచ్చాను అంటున్నారు కానీ...నేను అలా ఫీల‌వ‌డం లేదు. ఒకరికి ఒక‌రం ఇచ్చిపుచ్చుకున్నాం. రాముతో మాట్లాడే ప్ర‌తిక్ష‌ణాన్ని బాగా ఎంజాయ్ చేసేవాడిని. నేను ఫ‌స్ట్ లో చాలా మందితో క‌నెక్ట్ అయ్యేవాడిని కాదు. కానీ రాము నేను న‌క్ష‌త్రాలు గురించి బ్రూస్ లీ గురించి బాగా మాట్లాడుకునేవాళ్లం. దాంతో మా ఇద్ద‌రికి బాగా క‌నెక్ట్ అయ్యింది. ఆ క‌న్షెన్ తో రాము పై కాన్ప‌నిడెన్స్ వ‌చ్చింది. దానిని రాము నిల‌బెట్టుకున్నాడు. శివ సినిమా అనేది లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఫ‌ర్ మీ. తెలుగు సినిమాని మార్చేసిన సినిమా. ఇండియాలో 100 బెస్ట్ మూవీస్ సెలెక్ట్ చేస్తే అందులో శివ ఉంది. అలా జ‌ర‌గ‌డం వెరీ రేర్. ఇప్పుడు రాజమౌళి బాహుబ‌లితో సంచ‌ల‌నం సృష్టించాడు. నా లైఫ్ లో ఉన్నందుకు రాముకు థ్యాంక్స్ చెబుతున్నాను. నాతో శివ 2 తీద్దామ‌ని చాలా మంది వ‌చ్చారు. రాము తీస్తానంటే చేయ‌డానికి నేను రెడీ అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment