టెర్రరిస్ట్‌గా సమంత యాక్టింగ్‌పై సెలబ్రిటీల రియాక్షన్

  • IndiaGlitz, [Wednesday,May 19 2021]

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' ట్రైలర్ బుధవారం రిలీజయ్యింది. అది అక్కినేని నాగచైతన్యకు నచ్చింది. ఆల్రెడీ 'ది ఫ్యామిలీ మ్యాన్' ఫస్ట్ సీజన్ పెద్ద హిట్. ఇప్పుడీ సెకండ్ సీజన్‌లో బెటర్ హాఫ్ సమంత యాక్ట్ చేసింది. అందుకని, చైతన్యకు బాగా నచ్చి వుండొచ్చు. ట్రైలర్‌కు పదికి పది మార్కులు వేశాడు. సమంతకు చైతన్య రియాక్షన్ మీద డౌట్ వచ్చింది. 'పదికి పది ట్రైలర్‌కా, నాకా' అని అడిగింది. సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే చైతన్య, సమంతకు రిప్లై ఇవ్వలేదు. ఇంట్లో ఏదో ఒక ఆన్సర్ ఇచ్చి వుంటారు.

'ది ఫ్యామిలీ మ్యాన్ 2'లో సమంత టెర్రరిస్ట్‌గా యాక్ట్ చేసింది. 'మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను' అని ట్రైలర్ ట్వీట్ చేసింది. సెలబ్రిటీలకు ట్రైలర్, సమంత యాక్టింగ్ నచ్చాయి. ట్విట్టర్ లో కాంప్లిమెంట్స్ పోస్ట్ చేశారు.

ఇండస్ట్రీలో సమంతకు క్లోజ్ ఫ్రెండ్, లేడీ డైరెక్టర్ నందినిరెడ్డి 'చంపేశావ్' అన్నట్టు కామెంట్ చేశారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సమంతకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

టాలీవుడ్‌లో గ్లామర్ హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, తర్వాత బాలీవుడ్‌కు వెళ్ళి లేడీ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ చేస్తున్న తాప్సికి కూడా సమంత యాక్టింగ్ నచ్చింది. ట్రైలర్ అవుట్ స్టాండింగ్ అని, సమంతను న్యూలుక్ లో చూడటానికి వెయిట్ చేస్తున్నానని ట్వీట్ చేసింది.

హీరో అడివి శేష్, రైటర్ బీవీఎస్ రవి, విలన్ రోల్స్ చేసే కబీర్ సింగ్ సైతం సమంత నటనను మెచ్చుకున్నారు.

More News

పవన్ సినిమాపై రూమర్.. క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్

గబ్బర్ సింగ్ చిత్రంతో బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు. ఆ తర్వాత స్టార్ హీరోలతో పలు హిట్ చిత్రాలు నిర్మించాడు గణేష్. గత కొన్నేళ్లుగా సినిమా నిర్మాణానికి గణేష్ దూరంగా ఉంటున్నాడు.

రఘురామ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్..

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహరంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

లేడీ కానిస్టేబుల్ హనీ ట్రాప్.. నాలుగో భర్త పోలీసులకు ఫిర్యాదు

వృత్తి పరంగా ఆమె ఒక కానిస్టేబుల్.. ప్రవృత్తి డబ్బున్న వారిని పెళ్లి పేరుతో మోసం చేయడం.. ఒకరు కాదు..

పీపీఈ కిట్ లేకుండా గాంధీ ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లిన కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. పీపీఈ కిట్ వేసుకోకుండా కేవలం మాస్కు పెట్టుకుని వెళ్లి గాంధీలోని కరోనా రోగులను పరామర్శించారు.

వ్యాక్సిన్‌కు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో కొవిడ్ కేసుల సంఖ్య భారీగానే ఉంది. అయితే వ్యాక్సిన్ కొరత కూడా రాష్ట్రాన్ని వేధిస్తోంది. 18-45 ఏళ్ల మధ్య వయసువారికి వ్యాక్సిన్ అందిస్తామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన విషయం తెలిసిందే.