జాగ్వార్ ద్వారా హీరోగా పరిచయవుతున్న నిఖిల్ సౌత్ లో పెద్ద హీరో అవుతాడు - టీజర్ రిలీజ్ కార్యక్రమంలో సినీప్రముఖులు

  • IndiaGlitz, [Sunday,July 31 2016]
75 కోట్ల భారీ బడ్జెట్‌తో మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కన్నడంలో అనేక సూపర్‌హిట్‌ చిత్రాలు నిర్మించిన హెచ్‌.డి. కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన భారీ చిత్రం జాగ్వార్. నిఖిల్‌కుమార్‌, దీప్తి హీరో హీరోయిన్స్‌గా నటించిన‌ ఈ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు ఓ విలక్షణమైన పాత్ర పోషించారు.బాహుబలి, భజరంగి భాయ్‌జాన్‌ చిత్రాలతో ప్రపంచమంతటా సంచలనం సృష్టించిన గొప్ప కథా రచయిత విజయేంద్రప్రసాద్ ఈ జాగ్వార్ చిత్రానికి కథ అందించ‌గా, ఎ.మహదేవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చెన్నాంబిక ఫిలింస్‌ పతాకంపై శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న భారీ చిత్రం జాగ్వార్ ఫస్ట్‌లుక్ & టీజర్ రిలీజ్ కార్య‌క్ర‌మం హైదరాబాద్‌ పార్క్‌ హయత్‌లో సినీ,రాజ‌కీయ‌ ప్రముఖుల సమక్షంలో ఘ‌నంగా జ‌రిగింది. టి.సుబ్బిరామిరెడ్డి, అల్లు అర‌వింద్, ఘంటా శ్రీనివాస‌రావు,కుమార‌స్వామి జాగ్వార్ టీజ‌ర్ ను రిలీజ్ చేసారు.
ఈ సంద‌ర్భంగా సీనియ‌ర్ నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ... టీజ‌ర్ చూస్తుంటే...ప్ర‌తి ఫ్రేమ్ గొప్ప‌గా తీసార‌నిపిస్తుంది. జాగ్వార్ అంటే చిరుత‌. ఈ టైటిల్ కి త‌గ్గ‌ట్టు టీజ‌ర్ ఉంది. అందులో నిఖిల్ న‌ట‌న కూడా టైటిల్ కి త‌గ్గ‌ట్టు ఉంది. కుమార్ స్వామి తెలుగులో కూడా మంచి చిత్రాల‌ను నిర్మించాలి. నిఖిల్ క‌న్న‌డంలోనే కాదు తెలుగులో కూడా హీరోగా స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. అర‌వింద్ త‌న‌యుడు అల్లు అర్జున్, సురేష్ బాబు త‌న‌యుడు రానా వ‌లే కుమారస్వామి త‌న‌యుడు నిఖిల్ కూడా స‌క్సెస్ అవుతాడ‌ని ఆశిస్తున్నాను అన్నారు.
అల్లు అర‌వింద్ మాట్లాడుతూ... కొడుకును హీరోగా ప‌రిచ‌యం చేస్తున్న‌ప్పుడు నేను ఎంత త‌ప‌న ప‌డ్డానో ఆ..త‌ప‌న‌ కుమార‌స్వామిలో చూస్తున్నాను. టీజ‌ర్ చూసిన‌ప్పుడు నిఖిల్ క‌ష్టం క‌నిపించింది. నిఖిల్ హీరోగా స‌క్సెస్ అవుతాడు అని ధృడంగా న‌మ్ముతున్నాను అన్నారు.
సురేష్ బాబు మాట్లాడుతూ....జాగ్వార్ ట్రైల‌ర్ పెంటాస్టిక్ గా ఉంది. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ గారి క‌థ‌, మ‌హ‌దేవ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా అంటే నిఖిల్ సేఫ్ హ్యాండ్స్ లో ఉన్న‌ట్టు. త‌మ‌న్ మ్యూజిక్ బాగుంది. జాగ్వార్ మంచి విజ‌యం సాధించాలి అని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు జాగ్వార్ టీమ్ అన్నారు.
జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ...నిఖిల్ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు. అలాగే కుమార‌స్వామి గారు స్టేట్ కోసం చాలా చేసాను. కొడుకు కోసం క‌ష్ట‌ప‌డ‌లేనా అంటూ చాలా క‌ష్ట‌పడుతున్నారు. ఆయ‌న‌కు రాజకీయాలు కంటే సినిమాలంటే మ‌క్కువ ఎక్కువ‌. ఈ భారీ చిత్రంలో నేను న‌టించ‌డం..కుమార‌స్వామి గారు నాపై చూపించిన అభిమానం ఎప్ప‌టికీ మ‌రువ‌లేను. వండ‌ర్ ఫుల్ టీమ్ తో రూపొందిన జాగ్వార్ స‌క్సెస్ సాధించాలి అన్నారు.
నిర్మాత సి.క‌ళ్యాణ్ మాట్లాడుతూ...చెన్నాంబిక ఫిలింస్ బ్యాన‌ర్ అంటే ఓ చ‌రిత్ర‌. ఈ సంస్ధ ద్వారా ఏ హీరోని ప‌రిచ‌యం చేసినా స‌క్సెస్ సాధించారు. కుమార‌స్వామి అప్పుడు ఎలా ఉన్నారో...ఇప్పుడు అలానే ఉన్నారు. ఆయ‌న‌లో ఎలాంటి మార్పు లేదు. జాగ్వార్ సెన్సేష‌న‌ల్ హిట్ సాధిస్తుంది అన్నారు.
గీత ర‌చ‌యిత రామ‌జోగ‌య్య‌శాస్త్రి మాట్లాడుతూ...టీజ‌ర్ చూస్తుంటే...హాలీవుడ్ మూవీ చూసిన ఫీలింగ్ క‌లుగుతుంది. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ గార్కి మ‌హ‌దేవ్ ద‌త్త‌పుత్రుడు లాంటివాడు. వాళ్లిద్ద‌రూ క‌లిసి చేసిన జాగ్వార్ లో ప్రేక్ష‌కులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయి. ఈ చిత్రంలో ఆరు పాట‌లు రాయ‌డం ఆనందంగా ఉంది అన్నారు.
క‌థా ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ...ఫ‌స్ట్ నిఖిల్ కోసం క‌థ రాయ‌మ‌ని న‌న్ను పిలిచిన‌ప్పుడు క‌ర్నాట‌క సినిమాకి క‌థ రాయాలా అనే ఆలోచ‌న‌తోనే కుమార‌స్వామి గార్ని క‌లిసాను. అప్పుడు నిఖిల్ గురించి ఓ వీడియో చూపించారు. అది చూసిన త‌ర్వాత డైమండ్ ని చూసిన ఫీలింగ్ క‌లిగింది. ప్రాజెక్ట్ నాకు అప్ప‌గించండి అన్నాను. న‌న్ను న‌మ్మారు ప్రాజెక్ట్ అప్ప‌గించారు. టీజ‌ర్ చూస్తుంటే...నిఖిల్ ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో ఆ క‌ష్టం తెలుస్తుంది. నిఖిల్ తాత‌కు త‌గ్గ మ‌న‌వ‌డు, తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకుంటాడు అని ఆశిస్తున్నాను అన్నారు.
సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ మాట్లాడుతూ...టీజ‌రే ఇలా ఉంటే...ఇక సినిమా ఏరేంజ్ లో ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. ఈ మూవీ కోసం నిఖిల్ చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు. టీమ్ అంతా చాలా కష్ట‌ప‌డుతున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో నేను భాగం అయినందుకు ఆనందంగా ఉంది అన్నారు.
డైరెక్ట‌ర్ మ‌హ‌దేవ్ మాట్లాడుతూ...2015లో క‌థ చెప్పాం. ఆత‌ర్వాత ఒక సంవ‌త్స‌రం పాటు స్ర్కిప్ట్ వ‌ర్క్ చేసాం. ఆత‌ర్వాతే షూటింగ్ ప్రారంభించాం. నిఖిల్ కి ప్ర‌తిదీ ప‌ర్ ఫెక్ట్ గా ఉండాలి. ఏక్టింగ్, డ్యాన్స్ ల‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. అదంతా స్ర్కీన్ పై క‌నిపిస్తుంది. నా స్ట్రెంగ్త్ నా టెక్నీషియ‌న్స్. అంద‌రి స‌హ‌కారంతో ఈ చిత్రాన్ని అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా తెర‌కెక్కిస్తున్నాను. కుమార‌స్వామి గారు రాజ‌కీయ నాయ‌కుడు అయిన‌ప్ప‌టికీ సినిమా రంగంలో ప్ర‌తి శాఖ పై ప‌ట్టు ఉంది. ఆయ‌న అండ‌గా ఉండ‌డం వ‌ల‌నే ఎలాంటి టెన్ష‌న్ లేకుండా ఇంత పెద్ద చిత్రాన్ని చేస్తున్నాం. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో రూపొందుతున్న‌ప్ప‌టికీ జాగ్వార్ ప‌రిపూర్ణ‌మైన తెలుగు సినిమా అన్నారు.
టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ...మాన‌వ‌త్వం అనే ప‌దానికి మ‌రో రూపం కుమార‌స్వామి. ఆయ‌న్ని 50 సంవ‌త్స‌రాల నుంచి చూస్తున్నాను. ఎలాంటి మార్పు లేదు. అటువంటి వారికే భ‌గ‌వంతుడు శ‌క్తి ఇస్తుంటాడు. టీజ‌ర్ చూస్తుంటే...నిఖిల్ డెడికేష‌న్ క‌నిపిస్తుంది. నిఖిల్ తెలుగు, క‌న్న‌డ‌లోనే కాకుండా త‌మిళ్ లో కూడా స‌క్సెస్ ఫుల్ హీరో కావాల‌ని కోరుకుంటున్నాను. బాహుబ‌లి, భజరంగి భాయ్‌జాన్ చిత్రాల క‌థార‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌, జ‌గ‌ప‌తిబాబు ఈ చిత్రంలో న‌టించ‌డం ఈ మూవీకి బిగ్ ఎస్సేట్. హాలీవుడ్ స్టైల్ లో ఉన్న జాగ్వార్ బిగ్ స‌క్సెస్ అవ్వాలి అన్నారు.
హీరో నిఖిల్ మాట్లాడుతూ...విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ గారు ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు నాన్న‌తో... నిఖిల్ ని నాకొడుకు అనుకుంటాను. మీరు టెన్ష‌న్ ప‌డ‌ద్దు అని చెప్పారు. ఆ మాట‌ల‌తో నాకు ధైర్యాన్ని ఇచ్చిన విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. డైరెక్ట‌ర్ మ‌హ‌దేవ్ ఒక సంవ‌త్స‌రం నుంచి స్ర్కిప్ట్ పై వ‌ర్క్ చేస్తున్నారు. మ‌నోజ్ ప‌ర‌మహంస కెమెరామెన్ క‌న్నా ఎక్కువుగా ఈ సినిమా గురించి ఆలోచిస్తూ న‌న్ను ఎంత‌గానో ప్రొత్స‌హించేవారు. త‌మ‌న్ గ్రేట్ మ్యూజిక్ అందించారు. మా నాన్న ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నారు. ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి మ‌రింత‌గా క‌ష్ట‌ప‌డ‌తాను. తెలుగు ఆడియోన్స్ న‌న్ను ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత కుమార‌స్వామి మాట్లాడుతూ....ఇంత మంది సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో మా అబ్బాయి సినిమా ఫంక్ష‌న్ జ‌ర‌గ‌డం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని రోజు. క‌న్న‌డ‌లో రాజ్ కుమార్, విష్ణువ‌ర్ధ‌న్, తెలుగులో ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్ నాకు ఇన్ స్పిరేష‌న్. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో డిస్ట్రిబ్యూట‌ర్ గా, ప్రొడ్యూస‌ర్ గా కెరీర్ ప్రారంభించాను. 100కు పైగా చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేయ‌గా నిర్మాత‌గా 6 చిత్రాల‌ను నిర్మించాను. న‌టుడుకు భాషా పరిమితులు ఉండ‌వు. ఏ భాష‌లో అయినా న‌టించ‌వ‌చ్చు. ఇక సినిమాని తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఇంత గ్రాండ్ గా నిర్మించామంటే ఆ క్రెడిట్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ గారికే చెందుతుంది. మేము క‌న్న‌డ‌లోనే ఈ సినిమాని తీయాల‌నుకున్నాం. ఆ స‌మ‌యంలో ఎందుకు తెలుగులో కూడా చేయ‌కూడ‌దు అని విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ గారు మ‌మ్మ‌ల్ని ఎంత‌గానో ప్రొత్స‌హించారు. ఇక నుంచి సంవ‌త్స‌రానికి మా సంస్థ‌లో ఖ‌చ్చితంగా ఒక చిత్రాన్ని తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో నిర్మించాలి అనుకుంటున్నాను. ఈ సినిమా 2016లో బెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుంది. తెలుగు ప్రేక్ష‌కులు మా అబ్బాయి నిఖిల్ ని ఆశీర్వ‌దించాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

More News

'మనమంతా' లాంటి ఫుల్ లెంగ్త్ తెలుగు సినిమాలో నటించడం హ్యాపీగా ఉంది - మోహన్ లాల్

విలక్షణ చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్,గౌతమి ప్రధాన పాత్రల్లో సాయికొర్రపాటి,వారాహి చలన చిత్రం బ్యానర్ పై రూపొందిన చిత్రం 'మనమంతా'

రిలయన్స్ మరియు డిస్నీ వారి' ది బిఎఫ్ జి' చిత్రానికి విశేష స్పందన

జురాసిక్ పార్క్ ,జాస్,ఇండియానా జోన్స్ వంటి అద్భుతమైన చిత్రాల రూపకర్త స్టీవెన్ స్పిఎల్బర్గ్ దర్శకత్వం లో వచ్చిన అద్భుతమైన ఫాంటసి చిత్రం, 'ది బి ఎఫ్ జి(ది బిగ్ ఫ్రెండ్లీ జయంట్)'.

పెళ్ళిచూపులు సినిమా ఎక్స్ ట్రార్డినరీగా ఉంది - దగ్గుబాటి రానా

డి.సురేష్ బాబు సమర్పణలో రాజ్ కందుకూరి(ధర్మ పథ క్రియేషన్స్),యష్ రంగినేని(బిగ్ బెన్ సినిమాస్)నిర్మాతలుగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో

చిరంజీవి గారి బాటలో మేమందరం పయనిస్తున్నాం...అభిమానుల ప్రేమకు మేమంతా బానిసలం -సాయిధరమ్ తేజ్

మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్,మన్నార చోప్రా,లెరిస్సా బొనేసి హీరో,హీరోయిన్స్ గా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ తిక్క.

రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ....

మాస్ రాజా రవితేజ బెంగాల్ టైగర్ తర్వాత మరో సినిమా చేయలేదు.