దాసరి మృతి పట్ల ప్రముఖుల సంతాపం
- IndiaGlitz, [Tuesday,May 30 2017]
నా అత్యంత ఆప్తుడు మిత్రుడు దాసరి ఇండియా లోనే గొప్ప దర్శకుడు మంచి మనిషి అటువంటి మనిషిని కోల్పోవడం ఇండస్ట్రీకి తీరని లోటు....ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి
- రజనీకాంత్
తొగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు దర్శకరత్న డా॥ దాసరి నారాయణరావు గారి మరణం యావత్త్ తొగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కగాని కోరుకుంటున్నాను.
- రామ్చరణ్
మా కులపెద్ద కన్నుమూత మాకు తీరని లోటు. మా దర్శకుల పెద్ద, దర్శకుల స్థాయి పెంచిన ప్రతిభాశాలి దాసరి గారి మరణం మా దర్శకులకు మాత్రమే కాక తెలుగు చిత్రసీమకు కూడా పెద్ద దెబ్బ. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటున్నాను.
-క్రిష్ జాగర్లమూడి
ఒక దర్శకుడిగా నాకు దార్శనికుడు, తెలుగు చిత్రసీమకు మార్గ దర్శకుడు దర్శకరత్న దాసరి గారి మరణం మాకు తీరని లోటు.
-దర్శకుడు శ్రీవాస్
ఒక దర్శకుడిగా, ఇండస్ట్రీ పెద్దగా దాసరి గారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు!
-గోపీచంద్
తెలుగు సినిమా కి , సినిమా దర్శకుల కులానికి గురువు , తెలుఁగు సినిమా చరిత్రని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన శ్రీ దాసరి నారాయణరావు గారు మృతి యావత్తు తెలుఁగు ప్రేక్షకులకి తీరని లోటు ... అయన లేని తెలుఁగు సినిమా ని ఊహించలేము .. శ్రీ దాసరి నారాయణ రావు గారి కుటుంభ సభ్యులకి నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను
- హీరో నాగ సౌర్య
దర్శకరత్న దాసరిగారి మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటు, నిర్మాత క్షేమం కోరే ఆయనలాంటి వ్యక్తి మరణం జీర్ణించుకోవడం కష్టం.
-సాయి కొర్రపాటి
ఇండస్ట్రీ ఎదుగుదల కోసం అనునిత్యం ఆరాటపడిన వ్యక్తి దాసరి గారు, అలాంటి మనిషి మన మధ్య లేకపోవడం బాధాకరం.
-నారా రోహిత్
మా దర్శకులందరికీ పెద్ద దిక్కులాంటి దాసరి గారు శారీరికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన ఆశయాలు మాత్రం ఎప్పటికీ మమ్మల్ని నడిపిస్తూనే ఉంటాయి.
-దర్శకుడు సంపత్ నంది
దాసరి గారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన సాధించిన ఘనత, తెలుగు సినిమాకు తీసుకొచ్చిన గౌరవం చిరస్మరణీయం.
-పి.వి.పి
ఆయన దర్శకదిగ్గజం మాత్రమే కాదు, తెలుగు సినిమాకు మణిహారం, ఆయన లాంటి గొప్ప వ్యక్తి ఇక లేరనే వార్త మింగుడుపడడం లేదు.
-చందు మోండేటి
మాలాంటి యువ నటులందరికీ స్ఫూర్తి అయిన దాసరి గారి మరణం మాకు తీరని లోటు.
-విజయ్ దేవరకొండ
తెలుగు సినిమా రొమ్ము విరుచుకొని నిలబడేలా చేసిన దార్శనికుడు దాసరి గారు మరణించడం మా దర్శకులందరికీ తీరని లోటు.
-దర్శకుడు ఎన్. శంకర్
అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుని చాలా త్వరగా కోల్కుని మళ్లీ ఇంటికొచ్చారు. ఇటీవలే ఫ్యాన్స్ సమక్షంలో ఘనంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఇంతలోనే దాసరి గారి గురించి పెను విషాదం లాంటి వార్తను వినాల్సి వచ్చింది. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. మా టీమ్ అందరికీ పెద్ద దిక్కులా ఉండే వ్యక్తిని మేము కోల్పోయాం. తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సేవలందించిన వ్యక్తి. దర్శక దిగ్గజం లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాం..
- 'మా' అధ్యక్షులు శివాజీ రాజా, జనరల్ సెక్రటరీ నరేష్
స్టార్ డమ్ నటులకు మాత్రమే సొంతం కాదని ప్రూవ్ చేసి, దర్శకుడి పేరు పోస్టర్ పైకి తెచ్చిన మహనీయుడు దాసరి, ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.
-దర్శకుడు తేజ
తెలుగువాడి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసి.. దర్శకుడి స్థాయిని పెంచిన దర్శకరత్న దాసరి మరణం నన్ను ఎంతో బాధిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నాను.
-నటుడు శర్వానంద్
తెలుగు చిత్రసీమకు పెద్ద దిక్కులాంటి దాసరి నారాయణరావు గారి మరణం జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నాను.
-నటుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్
ఇండస్ట్రీకి మాత్రమే కాదు మా కుటుంబానికి కూడా పెద్ద దిక్కు లాంటి దాసరి గారి మరణం మాకు తీరని లోటు.
-మంచు విష్ణు, మంచు మనోజ్
నేను తీసిన మొదటి సినిమాకి మొదటి అభినందన లభించింది దాసరి గారి నుంచే, అలాంటి వ్యక్తి మరణం నన్ను చాలా బాధించింది.
-దర్శకుడు క్రాంతి మాధవ్
నాలాంటి ఎంతోమంది నిర్మాతలకు స్ఫూర్తి ఆయన, మా "పెళ్ళిచూపులు" చిత్రానికి అనుక్షణం వెన్నంటి ఉన్న దాసరి గారు మరణించడాన్ని తట్టుకోలేకున్నాం.
-రాజ్ కందుకూరి
ఒక తెలుగు దర్శకుడిగా అన్ని 151 చిత్రాలకు దర్శకత్వం వహించి దర్శకుడే కెప్టెన్ అని నిరూపించిన వ్యక్తి దాసరిగారు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందు అండగా నిలబడే వ్యక్తి కూడా ఆయనే. తెలుగు చిత్రసీమకు ఆయన చేసిన కృషి మాటల్లో చెప్పలేం. దాసరిగారి దర్శకత్వంలో అహంకారి అనే సినిమాను చేశాను. ఆ సినిమా సమయంలో ఆయనతో చేసిన జర్నీ మరచిపోలేను. ఆయన మా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండేవారు. మా కుటుంబ పెద్దను కోల్పోయాం. దాసరిగారి కుటుంబంతో కూడా మాకెంతో సన్నిహితంగా ఉంటారు. దాసరినారాయణరావుగారి మరణం మాకు, కుటుంబానికే కాదు, తెలుగు చిత్రసీమకే తీరనిలోటు. దాసరి వంటి దర్శకుడు మళ్ళీ రాడు, రాలేడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఆ దేవణ్ణి వేడుకుంటున్నాను.
- డా.రాజశేఖర్, జీవిత
నన్ను నటుడిగా ఆదరించి ఆశీర్వదించిన అతి తక్కువ మంది వ్యక్తుల్లో దాసరి గారు ప్రధములు, అటువంటి గొప్ప మనిషి మరణం ఇండస్గ్రీకి తీరని లోటు.
-నటుడు శ్రీవిష్ణు
ఒక నటుడిగా, ఒక దర్శకుడిగా, ఒక వ్యక్తిగా నాపై దాసరి గారి ప్రభావం చాలా ఉంటుంది. అలాంటి మనిషి మరణ వార్త నన్ను ఎంతగానో బాధించింది.
-నటుడు-దర్శకుడు రవిబాబు
నా సినిమాల్లో తెలుగుదనం ఎక్కువగా ఉండాలనే ఆలోచన దాసరి గారి వల్లనే వచ్చింది. ఆయన సినిమాలు నాపై చూపిన ప్రభావం అలాంటిది. అలాంటి వ్యక్తి మరణం నన్ను కలచివేసింది.
-దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి
చిన్నాపెద్దా అనే తేడా లేకుండా టాలెంట్ ను ఎంకరేజ్ చేసిన మహోన్నత మనస్తత్వం కలిగిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఆయన మరణానికి చింతిస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
-దర్శకుడు సుధీర్ వర్మ