కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
Send us your feedback to audioarticles@vaarta.com
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం నేడు. నేటితో కేసీఆర్ 66వ పడిలోకి అడుగు పెట్టబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా కేసీఆర్ పుట్టిన రోజును టీఆర్ఎస్ శ్రేణులు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాయి. మరోవౌపు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజానీకం కూడా ఘనంగా వేడుకలు జరుపుకుని సోషల్ మీడియా ద్వారా ఆ ఫొటోలను పంచుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉండే పార్టీ ఆఫీసుల్లో అంగరంగ వైభవంగా కేకులు కట్ చేసి.. సేవా కార్యక్రమాల్లో కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పాల్గొన్నారు. అంతేకాదు.. హైదరాబాద్ సిటీలో ఎక్కడా చూసిన కేసీఆర్ ఫ్లెక్సీలు.. భారీ భ్యానర్లు వెలిశాయి.
శుభాకాంక్షల వెల్లువ!
ఇదిలా ఉంటే.. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కేసీఆర్ ఇంటికెళ్లి.. మరికొందరు సోషల్ మీడియా, మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సుఖ సంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో నిండు జీవితం గడపాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. వీరితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు, కేంద్ర మంత్రులు.. కేసీఆర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం జగన్ ట్వీట్..:-
‘తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
చంద్రబాబు ట్వీట్..:-
‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి @TelanganaCMO కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలను ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను’ అని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
పవన్ కల్యాణ్ ట్వీట్.. :-
‘గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్షును, ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నాను’ అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
ప్రత్యేకంగా కలిసిన రోజా!
ఏపీఐఐసీ ఛైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా.. సీఎం కేసీఆర్ను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా ఇంటికెళ్లిన రోజా.. ఆయనకు పుష్పగుచ్చాలిచ్చి.. స్వీట్ తినిపించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా.@TelanganaCMO
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 17, 2020
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి @TelanganaCMO
— N Chandrababu Naidu (@ncbn) February 17, 2020
కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలను ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.
గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్షును, ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నాను.
— Pawan Kalyan (@PawanKalyan) February 17, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments