కోడి రామకృష్ణ కుమార్తె పెళ్లి.. తళుక్కుమన్న నటీనటులు
- IndiaGlitz, [Thursday,February 06 2020]
శత చిత్రాల దర్శకుడు స్వర్గీయ కోడి రామకృష్ణ ఇంట వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కోడి రామకృష్ణ చిన్న కుమార్తె ప్రవల్లిక, మహేష్‌ల వివాహం బుధవారం రాత్రి 9.36 నిమిషాలకు జరిగింది. హైదరాబాదులోని గండిపేటలో ఉన్న కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్స్ ఈ పెళ్లికి వేదికగా నిలిచింది. ఈ వేడుకకు టాలీవుడ్ పాత, కొత్త తరం నటీనటులు, నిర్మాతలు, పలువురు దర్శకులు తళుక్కుమన్నారు.
ఈ వేడుకలో టాలీవుడ్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, కె.రాఘవేంద్రరావు, జయప్రద, మురళీమోహన్, జీవిత, గోపీచంద్, కోదండరామిరెడ్డి, అల్లు అరవింద్, దిల్ రాజు, కోదండరామిరెడ్డి, కె.విజయభాస్కర్, బి.గోపాల్, పరుచూరి గోపాలకృష్ణ, దేవీ ప్రసాద్, వీరశంకర్, శివాజీరాజా, మారుతి, ముత్యాల సుబ్బయ్య, వినోద్ కుమార్, కాశీ విశ్వనాథ్, అలీ, నాగబాబు అర్ధాంగి పద్మజ, ఆయన కుమార్తె నిహారికతో పాటు పలువురు ప్రముఖులు విచ్చేసి.. వివాహ వేడుకను గ్రాండ్ సక్సెస్ చేశారు. సిని ప్రముఖులు కాకుండే పలువురు రాజకీయ నేతలు సైతం విచ్చేశారు.
కాగా.. వంద సినిమాలకు దర్శకత్వం వహించి దిగ్గజ దర్శకుడిగా టాలీవుడ్ చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్న కోడి రామకృష్ణ అనారోగ్యంతో 2019 ఫిబ్రవరి 22న కన్నుమూసిన సంగతి తెలిసిందే.