కోడి రామకృష్ణ కుమార్తె పెళ్లి.. తళుక్కుమన్న నటీనటులు

శత చిత్రాల దర్శకుడు స్వర్గీయ కోడి రామకృష్ణ ఇంట వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కోడి రామ‌కృష్ణ చిన్న కుమార్తె ప్రవ‌ల్లిక, మహేష్‌ల వివాహం బుధ‌వారం రాత్రి 9.36 నిమిషాల‌కు జరిగింది. హైదరాబాదులోని గండిపేటలో ఉన్న కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్స్ ఈ పెళ్లికి వేదికగా నిలిచింది. ఈ వేడుకకు టాలీవుడ్ పాత, కొత్త తరం నటీనటులు, నిర్మాతలు, పలువురు దర్శకులు తళుక్కుమన్నారు.

ఈ వేడుకలో టాలీవుడ్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, కె.రాఘవేంద్రరావు, జయప్రద, మురళీమోహన్, జీవిత, గోపీచంద్, కోదండరామిరెడ్డి, అల్లు అరవింద్, దిల్ రాజు, కోదండరామిరెడ్డి, కె.విజ‌య‌భాస్కర్‌, బి.గోపాల్‌, ప‌రుచూరి గోపాల‌కృష్ణ, దేవీ ప్రసాద్‌, వీర‌శంక‌ర్‌, శివాజీరాజా, మారుతి, ముత్యాల సుబ్బయ్య, వినోద్‌ కుమార్‌, కాశీ విశ్వనాథ్‌, అలీ, నాగబాబు అర్ధాంగి పద్మజ, ఆయన కుమార్తె నిహారికతో పాటు పలువురు ప్రముఖులు విచ్చేసి.. వివాహ వేడుకను గ్రాండ్ సక్సెస్ చేశారు. సిని ప్రముఖులు కాకుండే పలువురు రాజకీయ నేతలు సైతం విచ్చేశారు.

కాగా.. వంద సినిమాలకు దర్శకత్వం వహించి దిగ్గజ దర్శకుడిగా టాలీవుడ్ చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్న కోడి రామకృష్ణ అనారోగ్యంతో 2019 ఫిబ్రవరి 22న కన్నుమూసిన సంగతి తెలిసిందే.

More News

'బాఘీ 3' వామ్మో ఇవేం ఫైట్స్‌ రా బాబోయ్!

బాలీవుడ్‌ నటుడు టైగర్‌ష్రాప్‌ హీరోగా ఇప్పటికే బాఘి, బాఘి 2 చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.

తల్లిని చంపి.. సోదరుడ్ని పొడిచి.. ప్రియుడికి మాటిచ్చి.. అండమాన్‌కు!!

మానవత్వం మంట గలిసింది. అసలు తామేం చేస్తున్నామో.. అసలెందుకిలా చేస్తున్నామో తెలియక కొందరు పిచ్చిపిచ్చి ప్రవర్తించి కుటుంబ సభ్యులను చంపేందుకు కూడా వెనుకాడట్లేదు.

పాటల విడుదల సన్నాహాల్లో 'కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్'

డాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా, హీరోగా, దర్శకుడిగా పలు సంచలన విజయాలు సాధించడం తెలిసిందే.

పూరి జ‌గ‌న్నాథ్‌, విజ‌య్ దేవర కొండ.. సరికొత్త టైటిల్..!

యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈయ‌న హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో

'ఆర్ఆర్ఆర్‌' లో ఛాన్స్ ద‌క్కించుకున్న హాట్ బ్యూటీ

ప‌లు సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్‌, స్పెష‌ల్ రోల్స్‌లో న‌టిస్తోన్న హాట్ బ్యూటీ హంస నందిని ఇప్పుడు భారీ ఛాన్స్‌ను ద‌క్కించుకుంది.