close
Choose your channels

CM Jagan:సీఎం జగన్‌కు పుట్టినరోజు శుభాకంక్షలు చెప్పిన ప్రముఖులు

Thursday, December 21, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagana Mohan Reddy) పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. పల్లెటూరు, పట్టణం అనే తేడా లేకుండా ఊరురా బర్త్‌డే విషెస్ ఫ్లెక్సీలు కట్టారు. అంతేకాకుండా రక్తదాన శిబిరాలతో పాటు అన్నదానం, వస్త్రదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రుల్లో రోగులకు.. వృద్ధ, అనాథ ఆశ్రమాల్లో పండ్లు పంచి పెడుతున్నారు. ఇక అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు కూడా నాటుతున్నారు.

ఇదిలా ఉంటే రాజకీయ ప్రముఖులు కూడా జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏపీ సీఎం జగన్‌ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి హృదయపూర్వ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ట్విట్టర్‌లో తెలిపారు.

జగన్‌ మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విషెస్ చెప్పారు.

సంక్షేమ సామ్రాట్ అయిన మా జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మంత్రి ఆర్కే రోజా ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా పేదలకు సర్‌ప్రైజ్‌ కూడా ఇచ్చారు. శాంటాక్లాజా వేషంలో నిరుపేదల ఇంటికి వెళ్లి కానుకలు ఇచ్చారు.

సీఎం జగన్‌ ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలి. ఆయన మరెన్నో సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్నాంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. వీరితో పాటు అనేక మంది ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment