కరోనాపై యుద్ధం.. విరాళాలు ప్రకటిస్తున్న ప్రముఖులు

కరోనా వైరస్ ప్రపంచాన్ని కాటేస్తున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు సాయం చేసి పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ చేయడం.. మరోవైపు ప్రజా రవాణా బంద్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇంటికే రేషన్.. కందిపప్పుతో కొంచెం డబ్బులు కూడా ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ క్రమంలో తమ వంతుగా సాయం చేయడానికి నటీనటులు, వ్యాపారవేత్తలు ముందుకొస్తున్నారు.

నటుల ఆర్థిక సాయం..!

ఇదివరకే.. టాలీవుడ్ హీరో నితిన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు చెరో పది లక్షల రూపాయిలు ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్ సౌతిండియా కార్మికులకు సినీనటుడు రజనీకాంత్ రూ.50 లక్షల సాయం ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. సినీ కార్మికులకు అండగా ఉండాలని నడుం బిగించిన తమిళ నటులు సూర్య, కార్తీ (సూర్య బ్రదర్స్) రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు.

ఎవరెవరిచ్చారు..!?

విజయవాడ ఎంపీ కేశినేని నాని - రూ. 5 కోట్లు (ఎంపీల్యాడ్ నిధులు)
టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ - రూ. 50 లక్షలు (ఎంపీల్యాడ్ నిధులు). మరోవైపు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో ఉచితంగా శానిటైజర్లు, మాస్క్‌లు పంపిణీ చేస్తున్నారు.

More News

భారత్‌‌లో కరోనా పరిస్థితి ఎలా ఉందంటే..

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వేలాది మంది చనిపోగా.. లక్షలాది మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

దిల్‌రాజుకి టెన్ష‌న్... మాటిచ్చిన పవన్ కళ్యాణ్

దిల్‌రాజు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుంది. క‌రోనా వైర‌స్‌తో ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ స్తంభించింది. థియేట‌ర్స్ మూత ప‌డ్డాయి. సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. అయితే ఈ క‌రోనా ఎఫెక్ట్ దిల్‌రాజుపై

ఏపీలో అన్ని బార్డర్లు మూసివేత.. రాకపోకలు బంద్

తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రకటించిన విషయం విదితమే. మరోవైపు లాక్‌డౌన్‌ను పకడ్బందిగా అమలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు, సీఎస్‌లకు

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో 'పది' పరీక్షలు వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న పదో తరగతి పరీక్షలపై కరోనా ప్రభావం పడింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ప్రకటించిన విషయం విదితమే. కాగా.. ఈ క్రమంలో మార్చి 31 న జరగాల్సిన

కరోనాపై యుద్ధం.. తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం

కరోనా వైరస్ ప్రపంచాన్ని కాటేస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ కుర్ర హీరో నితిన్ పెద్ద మనసు చాటుకున్నాడు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ చేయడం.. మరోవైపు ప్రజా రవాణా బంద్ చేసిన సంగతి తెలిసిందే.