కరోనాపై యుద్ధం.. విరాళాలు ప్రకటిస్తున్న ప్రముఖులు
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వైరస్ ప్రపంచాన్ని కాటేస్తున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు సాయం చేసి పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ చేయడం.. మరోవైపు ప్రజా రవాణా బంద్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇంటికే రేషన్.. కందిపప్పుతో కొంచెం డబ్బులు కూడా ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ క్రమంలో తమ వంతుగా సాయం చేయడానికి నటీనటులు, వ్యాపారవేత్తలు ముందుకొస్తున్నారు.
నటుల ఆర్థిక సాయం..!
ఇదివరకే.. టాలీవుడ్ హీరో నితిన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు చెరో పది లక్షల రూపాయిలు ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా కార్మికులకు సినీనటుడు రజనీకాంత్ రూ.50 లక్షల సాయం ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. సినీ కార్మికులకు అండగా ఉండాలని నడుం బిగించిన తమిళ నటులు సూర్య, కార్తీ (సూర్య బ్రదర్స్) రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు.
ఎవరెవరిచ్చారు..!?
విజయవాడ ఎంపీ కేశినేని నాని - రూ. 5 కోట్లు (ఎంపీల్యాడ్ నిధులు)
టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ - రూ. 50 లక్షలు (ఎంపీల్యాడ్ నిధులు). మరోవైపు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో ఉచితంగా శానిటైజర్లు, మాస్క్లు పంపిణీ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout