Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ తొలి వర్థంతి సందర్భంగా ప్రముఖుల నివాళి
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ కృష్ణ మరణించి నేటితో ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా అభిమానులు, కుటుంబసభ్యులు, ప్రముఖులు ఆయనను స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. ఇక ఘట్టమనేని కుటుంబం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ క్లబ్లో తొలి వర్థంతి కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో హీరో మహేష్ బాబు, ఘట్టమనేని కుటుంబసభ్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హాజరై కృష్ణకి నివాళులర్పించారు. కాగా గతేడాది నవంబర్ 15న అనారోగ్యంతో కృష్ణ మృతిచెందిన సంగతి తెలిసిందే.
మరోవైపు కృష్ణ వారసులు సోషల్ మీడియా వేదిక తమ నివాళులు తెలియజేస్తున్నారు. “నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నాము. నేను మీ ఇంటికి వచ్చాను. ఒకప్పుడు మేము వస్తే నువ్వు ఎంత బిజీలో ఉన్న మా కోసం వచ్చేవాడివి. సినిమాల్లో నువ్వు ఒక మ్యాజిక్ క్రియేట్ చేశావని ప్రపంచం మొత్తం చెబుతుంటుంది. కానీ వాళ్ళకి తెలియదు నువ్వు పర్సనల్ లైఫ్ లో కూడా అదే మ్యాజిక్ ని క్రియేట్ చేశావని. లవ్ యు నాన్న” కృష్ణ కూతురు మంజుల తెలిపారు.
ఇక కృష్ణ అల్లుడు, హీరో సుధీర్ బాబు “మామయ్య , మీకు మాకు ఉన్న దూరం ఎంత? కలవరిస్తే కలలోకి వచ్చేంత, తలచుకుంటే మా గుండెల్లో బ్రతికేంత. ఆగిపోలేదు మీ ప్రస్థానం, ఆరిపోలేదు మా అభిమానం. మరువను నేను, మరువదు నేల. మీ కీర్తి, మీ స్పూర్తి అమరం అద్భుతం” అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com