హైదరాబాద్‌లో సోషల్ నెట్ వర్కింగ్ ఫ్లాట్ పామ్ "సెలబ్ కనెక్ట్"
Send us your feedback to audioarticles@vaarta.com
సోషల్ మీడియాకు అదరణ అంతకు అంత పెరుగుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో సరికొత్త ఐడియాలజీతో మన హైదరాబాద్ నగరంలోకి సెలబ్ కనెక్ట్ అనే సోషల్ కనెక్టింగ్ నెట్ వర్క్ స్టార్టయ్యింది.
"సెలబ్రిటీలను ఫ్యాన్స్, ఫాలోవర్స్ వివిధ రకాలైన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఫాలో అవుతుంటారు. ఇలాంటి వారికి వారి అభిమాన సెలబ్రిటీలను కలుసుకోవాలనే ఆకాంక్ష ఎక్కువగా ఉంటుంది. వారికి కలలాగా మిగిలిపోతుంటుంది. అలాంటి కలను నిజం చేయడానికే సెలబ్ కనెక్ట్‌ను స్టార్ట్ చేశాం.
అభిమానులు వారికి ఇష్టమైన సెలబ్రిటీతో కొంత సమయాన్ని గడపవచ్చు. ఇది అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. తమకు ఇష్టమైన వ్యక్తితో లైవ్‌గా మాట్లాడవచ్చు. ఆడియో కాల్స్, వీడియో కాల్స్, సెల్ఫీ తీసుకోవచ్చు. ఇన్స్టెంట్ చాటింగ్ చేయడమే కాదు.. మెసేజ్‌లు కూడా పెట్టవచ్చు.
ఇలా ఇన్‌స్టా గ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో సెలబ్ కనెక్ట్ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. కేవలం సినీ తారలే కాదు, ప్రముఖ క్రికెటర్లు, బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఇలా విభాగాల్లోని సెలబ్రిటీస్‌తో అభిమానులు తమ అనుభూతులను పంచుకోవచ్చు" అని అంటున్నారు.
సెలబ్ కనెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ రాజా జాటా అనువజ్ఞులైన అడ్వజైర్స్, మెంటర్స్ ఉండటమే సెలబ్ కనెక్ట్‌కు ప్రధానమైన బలం. భారతదేశంలోని హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరు నగరాల్లో సెలబ్ కనెక్ట్ జూన్, ఆగస్ట్ నెలల్లో లాంచ్ కానుంది. స్టీవెన్ స్పీల్ బర్గ్ ముఖ్య అతిథిగా నవంబర్‌లో న్యూయార్క్ నగరంలో సెలబ్ కనెక్ట్ ప్రారంభం కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments